షాకింగ్: క్యాన్సర్ బారిన పడ్డ ఆ హీరో కొడుకు
ముంబై : బాలీవుడ్ కిస్సుల కింగుగా, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మి నాలుగేళ్ల కుమారుడు అయాన్‌కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఇది తొలి దశలో ఉన్న బోన్ మ్యారోగా వైద్యులు గుర్తించారు. ఈ లిటిల్ బాయ్ కిడ్నీల్లో ఉన్న అపాయకరమైన ట్యూమర్‌ను స్కానింగులో గుర్తించారు.
ఈ విషయాన్ని ఇమ్రాన్‌తో పలు సినిమాలు తీసిన దర్శక నిర్మాత మహేష్ భట్.....వెల్లడించారు. 'సోమవారం నాకు ఇమ్రాన్ నుండి ఫోన్ వచ్చింది. హిందూజా ఆసుపత్రిలో తన నాలుగేళ్ల కుమారుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు. వెంటనే సర్జీరీ చేయాలని వైద్యులు సూచించారు. కీమోథెరపీ చేసే అవకాశం కూడా ఉంది' అన్నారు.

తన కుమారుడి గురించి వైద్యులు ఆ షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఇమ్రాన్ డీలా పడిపోయాడు. ఇంత చిన్న వయసులో అయాన్‌కు ఇలా జరుగడాన్ని ఇమ్రాన్ తట్టుకోలేక పోతున్నాడు. ఇంకా ఎంతో జీవితం ఉన్న కుర్రాడు. అయాన్ త్వరగా కోలు కోవాలని కోరుకుంటున్నాను...అని మహేష్ భట్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఇమ్రాన్ హస్మి బాలీవుడ్ మూవీ 'మిస్టర్. ఎక్స్' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఈచిత్రం షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. తన కుమారుడితో గడిపేందుకు సౌతాఫ్రికా షూటింగ్ షెడ్యూల్ కేన్సిల్ చేయాలని దర్శక నిర్మాతలను ఇమ్రాన్ హస్మి కోరినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











