ఒకేసారి మూడు సీక్వెల్ చేస్తున్న హీరో

By Srikanya

సీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకున్న ఎమ్రాన్ హష్మి తాజాగా మూడు చిత్రాల సీక్వెల్ లో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. ఆ చిత్రాలు మర్డర్, జన్నత్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఎ ముంబై. ఈ మూడు భాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినవే. ఈ విషయమై ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ..వన్స్ అపాన్ ఇన్ ముంబై సీక్వెల్ స్క్రిప్టు రెడీ అయిపోయింది. అతి త్వరలోనే మొదలవుతుంది. జన్నత్ విషయానికి వస్తే వచ్చే జనవరిలో ప్రారంభమవుతుంది. కునాల్ దేశముఖ్ ఈ చిత్రానికి స్క్రిప్టు చేసాడు. జన్నత్ కన్నా అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ మారి మరో ఫీల్డ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చర్చ ఉంటుంది. ఇక నాకు ఇండస్ట్రీలో గుర్తిపు తెచ్చిన చిత్రం ఏమిటీ అంటే మర్డర్ అని క్లియర్ గా చెప్తాను. దాంతో ఆ సీక్వెల్ మీద నాకు కాస్త మక్కువ ఎక్కువే. నవంబర్ నుంచీ షూటింగ్ ఉంటుంది. మల్లికా షెరావత్ ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్ అన్నాడు. ప్రస్తుతం క్రూక్ అనే చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉందని, ఆ చిత్రం ఆస్ట్రేలియాలోని జాతి వివక్షతపై తీసిన చిత్రమని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X