ముద్దంటే వద్దంటున్న కిస్సుల కింగ్
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు...కానీ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి విషయంలో మాత్రం ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ ద లాస్ట్ ఇప్రెషన్ అన్న చందంగా తయారైంది. మర్డర్ సినిమా ద్వారా ఎంటర్ రైన ఈ హీరో ఆ సినిమాలో మల్లికా షెరావత్ తో గతంలో సినీ ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా లిప్ కిస్సులతో చెలరేగి పోయిన ముద్దుల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చాలా మంది చాలా మంది దర్శకులు కవలం ముద్దు సన్నివేశాలు ప్లాన్ చేసి ఇమ్రాన్ కోసం కథలు తయారు చేయడం మొదలు పెట్టాడు. దీంతో అన్నీ ఇలాంటి అవకాశాలే వస్తుండటంతో ఇతర షేడ్ లలో తన పెర్ఫార్మెన్స్ నిరూపించుకోవడానికి వీలు లేకుండా పోయింది ఈ ముద్దుల కింగ్ కు.
దీంతో ఇకపై ముద్దు సన్నివేశాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్...ఇకపై యాక్షన్ హీరోగా, లవర్ బాయ్ గాః, ఇలా నటనకు ప్రాధాన్యం ఉండే పలు పాత్రల్లో తన టాలెంట్ నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎవరైనా దర్శకులు ముద్దు సీన్ల సబ్జెక్టుతో తన దగ్గరకు వస్తే అలాంటి చేయడం తన వల్ల కాదంటూ వారిని వెనక్కి పంపుతున్నాడట. ఇలా అయితే ఇమ్రాన్ కు సినిమా అవకాశాలు తగ్గి పోయే అవకాశం ఉన్నా...ఫర్వాలేదనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. మరి ఇమ్రాన్ పట్టుదల అతనికి ఉన్న సీరియల్ కిస్సర్ అనే మచ్చను తొలగిస్తుందో? లేక సినిమా అవకాశాలే లేకుండా చేస్తుందో? చూడాలి...


Click it and Unblock the Notifications











