బూతు సినిమాలు చూస్తున్న హాట్ హీరో!
హీరోయిన్ల పెదాలను, అందాలను జుర్రేసుకుంటూ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఇమ్రాన్ హస్మి. ఈ బాలీవుడ్ హాట్ హీరో ప్రస్తుతం 'షాంఘై' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ బూతు సినిమాలు తీసే వ్యక్తిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈచిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో అభయ్ డియోల్, కల్కి కోయోచ్లిన్ కూడా నటిస్తున్నారు.
ఇందులో ఇమ్రాన్ పంజాబీ యువకుడి పాత్ర చేస్తున్నాడు. పగలంతా పెళ్లి వీడియోలు తీస్తూ రాత్రి సమయంలో సెక్స్ చిత్రాలు చిత్రీకరించడం అతని పని. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరు జోగి పార్మర్ గా వెల్లడించాడు. ఫోర్న్ ఫిల్మ్ మేకింగ్ అతని వృత్తి, బాలా బోల్డ్ గా కనిపిస్తాడు. ఈ పాత్ర చేయడంపై తాను ఎంతో ఎగ్జైట్ ఉన్నానని చెప్పుకొచ్చాడు.
అంతే కాదండోయ్ సినిమాలో రియాల్టీ ఉట్టిపడేలా నటించడం కోసం బోలెడు బూతు సినిమాలు చూశాడట ఈ హీరో. దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి విశాల్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 8న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో నీలిచిత్రాలు తీసే వ్యక్తిగా కనిపించనున్న ఇమ్రాన్....నీలి చిత్రాల తార సన్నీ లియోన్‌తో మాత్రం నటించడానికి నో చెబుతున్నాడు. ఇప్పటికే ...సిరియల్ కిస్సర్ అని తనపై పడ్డ ముద్రను జీర్ణించుకోలేక పోతున్న ఇమ్రాన్, ఆమెతో కలిసి నటిస్తే తనను కూడా అంతా ఫోర్న్ హీరో అని పిలవడం ఖాయం అని భయ పడుతున్నాడు.


Click it and Unblock the Notifications











