twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #EndofMega: ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ కార్డు పనిచేసిందా? నాగబాబు వల్లే అంటూ ట్రోల్స్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వివాదాస్పదంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షస్థానం కోసం పోటీ చేసిన ప్రకాశ్ రాజ్‌పై విష్ణు మంచు ఘన విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన రీతిలో జరిగిన ఈ పోరులో మంచు విష్ణు 100కుపైగా ఓట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకొన్నారు. అయితే విష్ణు మంచు విజయం తర్వాత సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ప్రకాశ్ రాజ్ ఓటమికి ప్రధాన కారణాలు అంటూ నెటిజన్లు #EndofMega ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

    ప్రకాశ్ రాజ్ అహంభావి అంటూ

    ప్రకాశ్ రాజ్ అహంభావి అంటూ

    ఇక ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్‌గా చేసుకొని ప్రత్యర్థి వర్గం పన్నిన వ్యూహంలో భాగంగా అహంభావి, షూటింగులకు సరిగా రాడు, నిర్మాతలతో గొడవలు పెట్టుకొంటారని చేసిన విమర్శలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. దాంతో ప్రకాశ్ రాజ్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతికూల ప్రభావం చూపింది. అయితే ఇలాంటి విమర్శలకు బలంగా సమాధానం చెప్పడంలో ప్రకాశ్ రాజ్ వర్గం దారుణంగా విఫలమైంది.

    ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేకి అంటూ

    ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేకి అంటూ

    మా ఎన్నికలకు కొద్ది గంటల ముందు ప్రకాశ్ రాజ్‌ను మరో లెవెల్‌లో టార్గెట్ చేశారు. ఆయన హిందూ వ్యతిరేకి, మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం లేదు అంటూ మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. అలాగే ప్రకాశ్ రాజ్ గెలిస్తే హైదరాబాద్‌లో ఉండరు. ఆయన ఇలాంటి పదవికి అర్హుడు కాదనే మరో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇలాంటి వాదనలు ప్రకాశ్ రాజ్‌కు మరింత నష్టం చేకూరాయి.

    పోస్టల్ బ్యాలెట్ వివాదంతో

    పోస్టల్ బ్యాలెట్ వివాదంతో

    ప్రకాశ్ రాజ్‌ను ఓడించేందుకు విష్ణు మంచు వర్గం చేసిన వ్యూహాలు బలంగా పనిచేశాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకోవడం, హైదరాబాద్‌లో లేని నటులను రప్పించి ఓటు వేయించుకోవడం విష్ణు మంచు వర్గానికి సానుకూలంగా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం బయటకు రాగానే ప్రకాశ్ రాజ్ ఆవేదన చెందుతూ.. ఎన్నికలు ఇలా జరపడం సరికాదు. ఇలా అక్రమాలకు పాల్పడటం నిబంధనలకు విరుద్ధం అంటూ ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మెగా క్యాంప్‌పై మరో వర్గం అధిపత్యం

    మెగా క్యాంప్‌పై మరో వర్గం అధిపత్యం

    ఇదంతా ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా పట్టు సాధిస్తున్న ఓ వర్గం తమ అధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మా ఎన్నికలు అవకాశం కల్పించాయి. టాలీవుడ్‌లో తమదే ఆధిపత్యం అనే ప్రూవ్ చేసే విధంగా అంతా ఏకమయ్యారు. రాజకీయాలకు అతీతంగా ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంలో ఐక్యమత్యాన్ని చాటుకొన్నారు. కొద్దికాలంగా అధిపత్యం ప్రదర్శిస్తున్న మెగా వర్గాన్ని నిలువరించడంలో ఈ వర్గం సక్సెస్ అయింది.

     ప్రకాశ్ రాజ్ స్వయంకృతాపరాధం అంటూ

    ప్రకాశ్ రాజ్ స్వయంకృతాపరాధం అంటూ

    మా ఎన్నికల్లో ఓటమికి ప్రకాశ్ రాజ్ సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు స్వయంకృతాపరాధం అని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అన్నివర్గాల మద్దతు సంపాదించకుండా ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం తీసుకోను. నేను గెలిస్తే వారి అంతు చూస్తాను అంటూ వ్యాఖ్యలు చేయడం ఆయనకు వ్యతిరేకంగా మారింది. అగ్ర నటులను కలిసి మద్దతు కట్టుకోవడంలో విఫలమయ్యారు అనే విమర్శ బలంగా వినిపిస్తున్నది.

    మెగా బ్రదర్ నాగబాబు తొందరపాటుతనం

    మెగా బ్రదర్ నాగబాబు తొందరపాటుతనం

    ఇక ప్రకాశ్ రాజ్‌కు అనుకూలంగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమైన చర్చకు దారి తీశాయి. కోట శ్రీనివాసరావుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యర్థి వర్గం పన్నిన వ్యూహంలో నాగబాబు చిక్కుకుపోవడం కూడా ప్రకాశ్ రాజ్‌ ఓటమికి వంద కారణాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. మంచు ఫ్యామిలిని వ్యక్తిగతం టార్గెట్ చేశారనే భావనను ఆ వర్గం ఓటర్లను మెప్పించేలా చేసింది. ఈ రెండు విషయాలు తటస్థ ఓటర్లను విష్ణువైపు మళ్లేలా చేసింది.

    Recommended Video

    MAA Elections : Chiranjeevi VS Mohanbabu మధ్య ఎన్నికలుగా Mind Game | PrakashRaj || Filmibeat Telugu
    పని చేసిన లోకల్ కార్డు మంత్రం

    పని చేసిన లోకల్ కార్డు మంత్రం

    మా ఎన్నికల్ల ప్రధానంగా లోకల్ కార్డు మంచి ఫలితాలను ఇచ్చిందని నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు. అలాగే మోడీ అనుకూల వర్గం ప్రకాశ్ రాజ్‌ను ఓడించడానికి చేసిన ప్రయత్నాలు బలంగా పనిచేశాయి. ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలు అనే విధంగా కొన్ని సొంత నిర్ణయాలు, కొన్ని ప్రత్యర్థుల వ్యూహాలు ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణాలుగా నిలిచాయి. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు End of Mega అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నాయి. టాలీవుడ్‌లో మెగా అధిపత్యాన్ని గండి పడిందనే మాట ఫలితాల తర్వాత ఘాటుగా వినిపిస్తున్నది.

    English summary
    Actor Prakash Raj Defeat in MAA Elections 2021. In this occassion, End of the mega tag is trending. Vishnu Manchu won in the MAA Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X