‘ఎందుకంటే ప్రేమంట’ ఆడియో వాయిదా?
రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ఆడియో ఈ నెల 21న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో 29వ తేదీకి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
స్రవంతి మూవీస్ బ్యానర్‌పై పి.రవి కిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మే 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. యువతరానికి ఈ సినిమా ఓ విజులవ్ ట్రీట్. కరుణాకరన్, రామ్, తమన్నాల కెరీర్‌లకు మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందన్నారు.
ఈ చిత్రంలోని పాత్రలు తమకెంతో సంతృప్తి నిచ్చాయని హీరో రామ్, హీరోయిన్ తమన్నా అంటున్నారు. మొన్న 'బద్రినాథ్', నిన్న 'ఊసరవెల్లి', నేడు 'రచ్చ'. ఇప్పుడు 'ఎందుకంటే ప్రేమంట' ఇలా యంగ్ హీరోస్ తో వరుసగా నటిస్తూ సాగుతోంది అందాల భామ తమన్నా. మరి ఎందుకంటే ప్రేమంట ఆమెకు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.
రామ్ త్వరలో 'ఒంగోలు గిత్త'గా కనిపించనున్నారు. ఎవరితోనైనా కయ్యానికి సై అంటూ ఉత్సాహంతో ముందుకి ఊరికే వాళ్లను ఒంగోలు గిత్తతో పోలుస్తుంటారు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఇలానే ఉంటుందన్నది సమాచారం. ఈ చిత్రంతో మరో కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











