‘ఎందుకంటే ప్రేమంట’ సెన్సార్ రిపోర్టు
'డార్లింగ్' తర్వాత కరుణాకరన్, 'కందిరీగ' తర్వాత రామ్, 'రచ్చ' తర్వాత తమన్నా...ఈ హిట్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. ప్రేమకథా చిత్రాలను కరుణాకరన్ ఎంతబాగా తీస్తారో ఆడియన్స్కి బాగా తెలుసు. ఒక వైపు నవ్వుతూనే ఉంటాం...మరో వైపు ఏదో తెలియని ఫీలింగుతో హార్ట్ టచ్చింగ్‌గా ఉంటాయి ఆయన సినిమాలు.
అతని దర్శకత్వంలో వచ్చే ఏ సినిమా అయినా టీనేజర్స్ అయితే తమకు తమను తాము ఆ పాత్రల్లో ఊహించుకోవడం, వయసు పైబడినవారైతే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి పోవడం ఖాయం. అలాంటి దర్శకుడి చేతిలో రూపొందుతున్న మరో రొమాంటిక్ చిత్రమే ఈ 'ఎందుకంటే ప్రేమంట'.
ఈ జాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఎలాంటి కత్తిరింపులు లేకుండా క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. ఈచిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ స్రవంతి మూవీస్ బేర్‌పై నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జూన్ 8వ తేదీన ఈచిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.
ఈ చిత్రం గురించి కరుణాకర్ గతంలో వివరిస్తూ.....అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా 'ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
రామ్ మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు.
రవికిషోర్ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్ ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ భాషపై మంచి పట్టు ఉంది. ఇక తమన్నా అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ ప్రేమ కథ అన్ని భాషలవారికీ నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.


Click it and Unblock the Notifications











