'ఎందుకంటే ప్రేమంట' ఆడియో రిలీజ్ డేట్
రామ్, తమన్నా జంటగా కరుణాకరన్ దర్సకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 21న పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ విషయం మీడియాకు తెలియచేయటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఆ సమావేశంలో...కురణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా 'ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే. అలాగే ఈ నెల 21న పాటల్ని విడుదల చేయనున్నాం అన్నారు.
నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్ ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ భాషపై మంచి పట్టు ఉంది. ఇక తమన్నా అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ ప్రేమ కథ అన్ని భాషలవారికీ నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హీరో రామ్ చెప్పారు. అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్


Click it and Unblock the Notifications











