‘ఎందుకంటే ప్రేమంట’ ఆడియో ట్రాక్ లిస్టు
రామ్, తమన్నా జంటగా కరుణాకరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ఆడియో రేపు(ఏప్రిల్ 29)న అన్నపూర్ణ స్టూడియోలో విడుదల చేయబోతున్నారు. జివి ప్రకాష్ ఈచిత్రానికి సంగీతం అందించారు. స్రవంతి రవి కిషోర్ స్రవంతి మూవీస్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 11న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా 'ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు. ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్ ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడని నిర్మాత చెప్పుకొచ్చారు.
'ఎందుకంటే ప్రేమంట' ఆడియో ట్రాక్ లిస్టు
1. చిల్ ఔట్
గానం: ఆండ్రియా , బిగ్ నిక్ , మాయా , విజయ్ ప్రకాష్
2. నీ చూపులే
గానం: కె.ఎస్ చిత్ర , హరి చరణ్
3. కిక్కో గిక్కో
గానం : క్రిష్, మాయ, రాహుల్ నంబియార్, రానియారెడ్డి
4. సిందరెల్లా
గానం : మేధ , రాహుల్ నంబియార్
5. ఎగిరి పోవె
గానం: చిన్మయి , హేమ చంద్ర


Click it and Unblock the Notifications











