హాట్ న్యూస్: ‘ఎందుకంటే ప్రేమంట’ రిలీజ్ వాయిదా
రామ్, తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జూన్ 1 న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే అనుకోని కారణాలు వలన జూన్ 8 కి ఈ చిత్రం వాయిదా వేసారు. అదే రోజున ఈ చిత్రాన్ని తమిళంలో 'ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్‌బెన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం క్యూట్ రొమాంటిక్ స్టోరీగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
దర్శకుడు కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా 'ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్ ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి పెరిగాడు. తమిళ భాషపై మంచి పట్టు ఉంది. ఇక తమన్నా అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ ప్రేమ కథ అన్ని భాషలవారికీ నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ- యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్‌ఫుల్‌గా చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్‌లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.


Click it and Unblock the Notifications











