twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుక్ ఖాన్‌కు ఈడీ నోటీసులు. 23న హాజరుకావాలి..

    ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జూలై 23న వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

    By Rajababu
    |

    ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. జూలై 23న వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ అనే సంగతి తెలిసిందే. ఈ జట్టుకు సంబంధించిన వ్యవహారంలో అక్రమంగా వాటాలు అమ్మారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

    Enforcement Directorate summons Shah Rukh Khan in IPL FEMA case, seeks his personal appearance

    కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్ఎస్పీఎల్) సంస్థ తన వాటాలను మారిషస్‌కు చెందిన సంస్థకు తక్కువ మొత్తానికి అమ్మినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో 73.6 కోట్ల నష్టం కేకేఆర్‌కు వాటిల్లింది. ఉద్దేశపూర్వకంగానే ఈ నష్టం జరిగిందని చూపించారనే అంశంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మార్చిలో షారుక్ ఖాన్, గౌరీఖాన్, జూహీ చావ్లాలకు నోటీసులు జారీ చేశారు.

    English summary
    Enforcement Directorate today summoned Shah Rukh Khan and sought his personal appearance on July 23, in connection with Kolkata Knight Riders FEMA case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X