twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి సినిమా చూసి... ఏడ్చిన జపాన్ ప్రధాని భార్య

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సుమారు పదిహేనేళ్ల తర్వాత శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ఇంటాబయటా కూడా మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శ్రీదేవి తన అభినయానికి ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. గత ఏడాది తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ భాషలోకి అనువదించారు.

    తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ షో జపాన్‌లో జరిగింది. ఈ షో జపాన్ ఫస్ట్ లేడీ, ఆ దేశ ప్రధాని భార్య అయిన అకీ ఆబె కూడా హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత అకీ ఆబె కళ్లు చెమర్చాయి. దీన్ని బట్టి 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాకు ఆమె ఎంతలా కనెక్ట్ అయ్యారో స్పష్టమవుతోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా ఎంతో బాగుందని ప్రశంసించారు. జపాన్లో ఈచిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతోంది.

    English Vinglish made Japan’s First-Lady cry

    ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రానికి గౌరీ షిండే దర్శకత్వం వహించారు. సునీల్ లుల్లా, ఆర్. బాల్కి, రాకేష్ ఝంఝన్ వాలా ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్ రాని కారణంగా సాధారణ మధ్య తరగతి మహిళ ఇంట, బయట ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది....తనను తాను ఎలా సక్సెస్ ఫుల్ లేడీగా నిరూపించుకుంది అనేది ఈ చిత్రం కథాంశం.

    English summary
    Sridevi starrer English Vinglish grand premiere was held there which was attended by lots of dignitaries. It included First-Lady of Japan, Mrs. Akie Abe as Chief Guest. At the end of the show, she was seen with moist eyes and little tears, showing how well she has connected to the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X