శృతి హాసన్ అసభ్య ఫోటోల కేసు తాజా అప్డేట్స్!
హైదరాబాద్: 'ఎవడు' చిత్రం షూటింగ్ సందర్భంగా హీరోయిన్ శృతి హాసన్‌ను అసభ్యకరమైన, అభ్యంతర కరమైన యాంగిల్స్‌లో ఫోటోలు తీసి, వాటిని మీడియాకు, వెబ్ సైట్లకు లీక్ చేసిన కేసు విషయమై పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు. శృతి హాసన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ విషయంలో 'ఎవడు' సినిమా టీం మొత్తంపై హీరోయిన్ శృతి హాసన్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా ప్రమోషన్ షూట్ లో తీసిన అభ్యంతరకమైన ఫోటోలను తన అనుమతి లేకుండా ఉద్దేశ పూర్వకంగా నెట్ లో పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో పోలీసులు ఎవడు సినిమా పబ్లిసిటీ డిజైనర్, ఫోటో గ్రాఫర్, ప్రొడక్షన్ మేనేజర్, పీఆర్వోలను విచారించినట్లు తెలుస్తోంది.

ఈ ఫోటోలను ఎవరు మీడియాకు, వెబ్ సైట్లకు విడుదల చేసారనే దానిపై పలువురు ఫోటో గ్రాఫర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది ఫోటోగ్రాఫర్లను పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ ఫోటోలు బయటకు లీక్ కావడం వెనక ఎవరి హస్తం ఉందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ ఫోటోలను తాను బయటకు రిలీజ్ చేయలేదని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాకు పని చేసిన వారిలో కొందరు కావాలనే ఈ ఫోటోలను బయటకు లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. త్వరలోనే పోలీసులు ఈ కేసులో అసలు దోషులను పట్టుకోనున్నారు.


Click it and Unblock the Notifications











