అన్నయ్య కల్యాణ్ రామ్ నా కోరిక తీర్చాడు.. మీ ప్రేమ మాకు ఎంతో అవసరం.. ఎన్టీఆర్ ఉద్వేగం

ఆదిత్య మ్యూజిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్, శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పించగా ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా సతీష్ వేజేశ్న దర్శకత్వం వహించిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నది. నందమూరి కల్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాదా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు. రాజు తోట కెమెరా, తమ్మి రాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

అన్నయ్య విభిన్నమైన పాత్రల్లో

అన్నయ్య విభిన్నమైన పాత్రల్లో

ఎంత మంచి వాడవురా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను ఈ వేడుకలో భాగస్వామ్యం చేసినందుకు చాలా థ్యాంక్స్. అన్నయ్య కల్యాణ్ రామ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ జోనర్లలో సినిమాలో నటించారు. కానీ నాకు ఓ కోరిక ఉండేది. ఆయన ఓ మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తే చూడాలని ఉండేది. ఆయన ఈ రోజు ఎంత మంచి వాడవురా చిత్రం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది దర్శకుడు సతీష్ వేజేశ్న ద్వారా నా కల సాకారం కావడం మరింత సంతోషంగా ఉంది.

శివలెంక కృష్ణప్రసాద్ మాకు..

శివలెంక కృష్ణప్రసాద్ మాకు..

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా, ఆదిత్య గుప్తా నిర్మాతలుగా ఎంత మంచి వాడవురా రావడం అందులో కల్యాణ్ రామ్ నటించడం సంతోషంగా ఉంది. శివలెంక కృష్ణ ప్రసాద్ మాకు నిర్మాతనే కాదు. ఆయనకు మా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. బాబాయ్‌తో చాలా సినిమాలు చేశారు. కృష్ణ ప్రసాద్ మాకు కుటుంబ సభ్యుడి లాంటివారు. అలాగే సినిమా నిర్మాణంలోకి ప్రవేశించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థకు శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ అన్నారు.

15న ఎంత మంచి వాడవురా

15న ఎంత మంచి వాడవురా

ఎంత మంచి వాడవురా సినిమా జనవరి 15వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఎంతో మంచి సంగీత దర్శకుడు గోపి సుందర్ మంచి పాటలు అందించారు. ఎంతో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాతో భాగమయ్యారు. ఈ సినిమా తప్పుకుండా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొంటున్నది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

అన్ని సినిమాలకు ఆదరణ ఉండాలి

అన్ని సినిమాలకు ఆదరణ ఉండాలి

సంక్రాంతి పండుగకు ఎంత మంచి వాడవురా సినిమాతోపాటు దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మంచి మనసుతో మంచి చిత్రాలను ఆదరించే గుణం తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఈ సినిమాకు మీ మంచి మనసుతో సహాయ సహకారాలు అందిస్తారని అనుకొంటున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

మీరు, మీ కుటుంబాలు సుఖ:శాంతులతో

మీరు, మీ కుటుంబాలు సుఖ:శాంతులతో

మీరు మంచి ఆనందంలో ఉన్నారు. ఇదే ఆనందాన్ని మీ ఇంటి కుటుంబ సభ్యులతో పంచుకొండి. ఇక్కడ ఉన్న మీ అందరి ప్రాణం, మీ తల్లిదండ్రులకు, అన్నా చెల్లెల్లకు, ముఖ్యంగా అన్నయ్య, మా కుటుంబానికి ఎంతో అవసరం. మీరందరూ సుఖ: సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ వాతావరణంలో రిలీజ్ అవుతున్న చిత్రాలు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించి.. తెలుగు చిత్ర సీమ ముందుకెళ్లేలా తోడ్పాటునందించాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X