Entha Manchivaadavuraa Pre Release Event : చాలా రోజులకు కొత్త కోణంలో చూపించారు : రాజీవ్ కనకాల

మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా చిత్రాలు చేసే సతీష్ వేగేశ్న కలిసి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఎంత మంచివాడవురా అంటూ టైటిల్‌తోనే ఓ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..

 క్లాస్ మాస్ మిక్స్ చేస్తే ఇది..

క్లాస్ మాస్ మిక్స్ చేస్తే ఇది..

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. ‘నేను ఈ టైమ్‌లో సంతోషంగా ఉండాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ సమయంలో మా నాన్న గారు ఉంటేఎంతో సంతోష పడేవారు. ఎన్టీఆర్ మాస్ చేస్తే సింహాద్రి, క్లాస్ చేస్తే బృందావనం మిక్స్ చేసి చేస్తే అరవింద సమేత, జనతా గ్యారెజ్.. కళ్యాణ్ రామ్ క్లాస్ చేస్తే 118, మాస్ చేస్తే అతనొక్కడే మిక్స్ చేసి చేస్తే.. అదే ఎంత మంచి వాడవురా. మామూలుగా ఉండే మనుషులను సామాన్యులు, గౌరవంగా చూస్తే మాన్యులు, మంచి చేస్తే ధన్యులు అంటారు.. మీరంతా ధన్యుల'ని తెలిపాడు.

ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్‌కు..

ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్‌కు..

ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. ఎన్నో ఏళ్లుగా మా సంస్థను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. మేము నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన వెంటనే జాతీయ అవార్గు సొంతం చేసుకొన్న సతీష్ వెజేశ్నతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకొంటుంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరు మనసుపెట్టి పనిచేశారు. ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. జనవరి 15న రిలీజ్ అవుతుంది. థియేటర్లో సినిమాను చూసి ఆదరించండి.

కొత్త కోణంలో చూపించారు..

అందరికీ నమస్కారం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్, కళ్యాణ్ రామ్ అభిమానులకు నమస్కారం. ఎంత మంచివాడవురా చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సతీష్ వేగేశ్నకు ధన్యవాదాలు. నన్ను చాలా ఏళ్ల తరువాత కొత్త కోణంలో చూపించిన దర్శకుడు సతీష్ వేగేశ్నకు, నిర్మాతలైన ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలకు థ్యాంక్స్. ఓ సారి కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళితే ఇలా బాగున్నావ్.. ఇలాగే ఉండు అంటూ ఈ చిత్రంలో క్యారెక్టర్ చేయమని అడిగాడు అని రాజీవ్ కనకాల అన్నారు.

సంక్రాంతికి మంచి పండుగ

నందమూరి అభిమానులకు నమస్కారం.. సంక్రాంతి మంచి పండుగ.. మంచి సినిమాలు తీసే డైరెక్టర్ సతీష్, మంచి నిర్మాతలైన ఉమేష్, సుభాష్ గుప్తా, మంచి సంగీత దర్శకుడు గోపీ సుందర్, మంచి హీరోయిన్ మెహ్రీన్, మంచి హీరో కళ్యాణ్ రామ్, మంచి నటీనటులున్న ఈ చిత్రాన్ని మంచి హిట్ చేయాలి అని కమెడియన్ ప్రవీణ్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X