ముఖ్యమంత్రిగా మినిస్టర్ ఏరాసు ప్రతాప రెడ్డి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ -''నీతి, నిజాయతీకి కట్టుబడి పనిచేసే ఓ ముఖ్యమంత్రి పాత్ర చుట్టూ సాగే కథ ఇది. అధికారం చేజిక్కించుకొనేందుకు కొద్దిమంది నాయకులు ఎలాంటి సమస్యల్ని సృష్టించారనే విషయం ఆసక్తికరం. రాజకీయ విలువల్ని ప్రతిబింబించే చిత్రమిది. నాకిది నాలుగో చిత్రం. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది'''అన్నారు.
''సమాజంలోని చెడును ఎత్తిచూపే చిత్రమిది''అన్నారు కోట శ్రీనివాసరావు. ఈ నెల 28తో చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోసాని కృష్ణమురళి, సాయాజీషిండే, రావు రమేష్, ఆర్.కె., సోనియా, కత్తి కార్తీక ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ. సమర్పణ: ఏరాసు ప్రతాప రెడ్డి
ఇక ఆ మధ్యన రాష్ట్రంలో సంచలనం రేపిన గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో మద్యవర్తిగా పనిచేసిన రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అని అనుమానాలు వ్యక్తమవుతూ వార్తలు వచ్చాయి. ఏకంగా సీబీఐ కోర్టు అదనపు న్యాయమూర్తి టి.పట్టాభిరామారావుకు రూ.10 కోట్లు డబ్బులు చెల్లించి బెయిలు ఇప్పించుకున్నట్లు మీడియాలో వచ్చింది. గత ఏడాది నవంబర్ 11న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చంచల్ గూడ జైలులో గాలి జనార్ధన్ రెడ్డిని కలిశారు. గాలి ఏరాసుకు దగ్గరి బంధువు అవుతారని తెలుస్తోంది. అయితే గాలిని కలిసేందుకు జైలుకు వచ్చిన మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తాను గాలిని కలిసేందుకు రాలేదని, జైలును తనిఖీ చేసేందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











