»   » నయనతార సినిమాకు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశంసలు

నయనతార సినిమాకు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశంసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మయూరి' సినిమా తెలుగులో ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ప్యూర్ హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీసు వద్ద కూడా ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు హాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘మాడిసన్ కంట్రీ' లాంటి హారర్ ఫిల్మ్స్ తెరకెక్కించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్, రైటర్, ప్రొడ్యూసర్ ఎరిక్ ఇంగ్లండ్ ఈ సినిమాపై ప్రశంస వర్షం కురిపించారు. ఇటీవలే ‘మాయ'(తమిళ వెర్షన్) సినిమా చూసానని, సినిమాను తెరకెక్కించిన విధానం బావుందని, బ్యాగ్రౌండ్ స్కోర్, హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఎరిక్ ఇంగ్లండ్ తన సినిమాలకు పని చేసే సౌండ్ ఇంజనీర్ కునాల్ రాజన్ ద్వారా ‘మాయ' సినిమా గురించి తెలుసుకుని చూసారు.

Eric England appreciates Nayantara's Film

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ తెలుగులో విడుదల చేసారు. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఈ హారర్ సినిమాలో నటించడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు కథలోకి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోతూ ఆ 'మాయా' ప్రపంచంలోకి వెళ్లిపోయి, క్యారెక్టర్ల తాలూకు భావోద్వేగాల్ని అనుభవించేలా చేస్తుంది. కథకు తగిన విధంగా రాన్‌ యోహాన్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింత భయానికి గురి చేస్తుంది. మద్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అసలు సిసలైన హారర్ సినిమా అంటే ఇలానే ఉంటుంది నేలా ఉంది. ప్రేక్షకులు కొత్తరకం హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతారు.

English summary
Hollywood filmmaker/writer/producer Eric England who made horror films such as 'Madison Country' and 'Contracted' can't stop praising the Nayantara starrer.
Please Wait while comments are loading...