పాపం...సన్నపడిందని తీసేసారు

By Srikanya

బెంగళూరు : జీరో సైజ్ కావాలని ఓ ప్రక్క అందరూ అంటూంటే మరొప్రక్క కొంతమంది దర్శక,నిర్మాతలు మాత్రం సన్నపడ్డా కష్టమే అని తేల్చి చెప్పేస్తున్నారు. అంతేకాదు..సన్నపడితే మాకు అక్కర్లేదు అని తీసిపారేస్తున్నారు. అందుకు హీరోయిన్ ఎరికా ఫెర్నాండెస్‌(గాలిపటం హీరోయిన్) ఉదంతమే పెద్దపాఠం. భారీ బడ్జెట్‌ సినిమాలో ఎరికా అవకాశాన్ని కోల్పోయింది.

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌తో ఆమె నటించిన 'నిన్నందలే' సినిమా హిట్‌ కావడంతో అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని భావిస్తే నిరాశే ఎదురైంది. ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ హీరోగా రూపొందుతున్న 'ఐరావత' సినిమా నుంచి ఎరికాను తప్పించారు. ఇందుకు కారణం కేవలం ఆమె సన్నగా ఉండడమేనట.

Erica Fernandes out of Airavatha

ఇప్పటికే కొన్ని సన్నివేశాల్లో ఆమె నటించింది కూడా. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఆరోగ్యం కుదుటపడ్డాక షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లగా దర్శకుడు ఎ.పి.అర్జున్‌ ఆశ్చర్యపోయారట. ఇంత పీలగా ఉన్న ఎరికాను దర్శన్‌కు జంటగా ఎలా కొనసాగించాలని తలలుపట్టుకున్నారు. దర్శన్‌తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులతో చర్చించి చివరకు తప్పించాలనే తీర్మానించారు.

ఆమెకు ఇచ్చిన పారితోషికాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధపడ్డారు. సినిమాను భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నందున పారితోషికం ఏమంత పెద్ద సమస్య కాదనేది దర్శక నిర్మాతల అభిప్రాయం. ఎరికా స్థానంలో మరొక హీరోయిన్ కోసం చూస్తున్నారు. 'బుల్‌బుల్‌' సినిమాలో నటించిన రచితారాం ఈ రేసులో ముందున్నట్లు తెలిసింది. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X