‘లింగా’ హక్కులు దక్కించుకున్న భారీ సంస్థ
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘లింగా'. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రజనీ కాంత్ జన్మదిన కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్' దక్కించుకుంది. భారీ ధరకు హక్కులు కోనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది.
పర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గతంలో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో ఈ చిత్రం వస్తుండటం అంచనాలు మరింత పెంచింది. రవికుమార్- రజని కాంత్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











