»   » మహేష్ సినిమాకు ‘ఈరోస్’ లాభాల లెక్క ఇదిగో..!

మహేష్ సినిమాకు ‘ఈరోస్’ లాభాల లెక్క ఇదిగో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన '1'(నేనొక్కడినే) చిత్రం టోటల్ రైట్స్ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ 'ఈరోస్ ఇంటర్నేషనల్' దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తం రూ. 72 కోట్లకు ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకుంది ఆ సంస్థ.

అయితే సినిమా మొత్తం హక్కులు ఇలా గంప గుత్తగా తీసుకోవడం చూస్తుంటే......ఇది రిస్క్ వ్యవహారంలా కనిపింది. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే అసలు అలాంటి పరిస్థితి లేదని స్పష్టం అవుతోంది. మహేష్ బాబు తెలుగులో టాప్ కలెక్షన్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరో. తెలుగు సినిమా మార్కెట్ ఏ రేంజిలో ఉందో ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' చిత్రంతో స్పష్టమైంది.

1-Nenokkadine

మహేష్ బాబుకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అధికం. గతంలో మహేష్ బాబు సినిమాల లెక్కలు, ఏయే ప్రాంతాల్లో మహేష్ బాబుకు సినిమాలకు ఎంత కలెక్షన్ స్టామినా ఉందో సర్వే చేసిన తర్వాతే అంత పెద్ద మొత్తం ఆ సంస్థ చెల్లించిందని స్పష్టం అవుతోంది. సినిమా మినిమమ్ ఆడినా 'ఈరోస్' సంస్థకు లాభాలు వస్తాయి. సూపర్ హిట్ అయితే జాక్ పాట్ ఖాయం అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

English summary
Bollywood giant Eros has done an outright purchase of the ‘1-Nenokkadine’ for a whopping Rs 72 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu