For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అర్ధనగ్నంగా సినీ తార.. వేశ్య, సిగ్గులేదా? మైండ్ దొబ్బిందా అంటూ నెటిజన్ల కామెంట్

  |

  బాలీవుడ్ అందాల తార ఇషా గుప్తా మరోసారి హాట్‌హాట్‌గా దర్శనమచ్చింది. అర్ధనగ్నంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇలా అందాలతో వేడెక్కించే ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి ఫొటోలు ఎన్నో అభిమానులకు కనువిందు చేశారు. అయితే ఇషాగుప్తా తీరుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజా ఫొటో వెనుక ఉన్న కథేంటి అంటే..

   సెక్సీగా ఫోజిచ్చి కష్టాల్లోకి

  సెక్సీగా ఫోజిచ్చి కష్టాల్లోకి

  రాహుల్ జాంగియానీ అనే ఫొటోగ్రాఫర్ చేసిన ఫొటోషూట్ కోసం ఇషా గుప్తా అర్ధనగ్నంగా మారింది. కెవిన్ క్లెయిన్ బ్రాండ్ అండర్ వేర్ ధరించి సెక్సీగా ఫొజిచ్చింది. వీపుపై ఉన్న డ్రాగన్ టాటూ ఆకట్టుకొనేలా ఉంది. అయితే లూజుగా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జీన్స్ వేసుకొని ఫొటోకు ఫోజివ్వడంపై నెటిజెన్లు రఫాడించారు.

  గట్టిగా రఫాడించిన నెటిజన్లు

  గట్టిగా రఫాడించిన నెటిజన్లు

  అర్ధనగ్నంగా ఉన్న ఫొటోల గురించి నెటిజన్లు స్పందిస్తూ.. సిగ్గులేదా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మైండ్ దొబ్బిందా అంటూ కొందరు విరుచుకుపడ్డారు. ఇలాంటి పనులు చేసినంత మాత్రాన మంచి సినిమాలు వస్తాయా? కొంచమైనా సిగ్గుతెచ్చుకో. హాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌పైన కాస్తా దృష్టిపెట్టు అని కొందరు రెచ్చిపోయారు.

  హాట్ ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్.... బూతులు తిట్టినా పట్టించుకోకుండా!

   నగ్నంగా మారితే ఏమొస్తుంది?

  నగ్నంగా మారితే ఏమొస్తుంది?

  ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు.. ఇలా నగ్నంగా మారితే మీ ఇంట్లో వాళ్లు చూస్తే ఏమనరా?. ఒంటి మీద ఎన్ని బట్టలు విప్పేసిన సినిమా ఆఫర్లు మాత్రం రావు. బ్రా కొనుక్కోవడానికి డబ్బులు లేవా?. నీవు పోర్న్ ఇండస్ట్రీలో చేరు.. అప్పుడు బాగుంటుంది. ఇంత చెడ్డ రోజులు వస్తాయి అని అంటూ ఇషాను గేలి చేశారు.

   భారతీయ సంస్కృతి ఇదేనా

  భారతీయ సంస్కృతి ఇదేనా

  విదేశీ హీరోయిన్లు బికినీలో ఉన్న.. ఇలా కనిపిస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ భారతీయురాలిని ఇలా చూస్తే ఎవరూ జీర్ణించుకోలేరు. భారతీయ సంస్కృతి ఏమౌపోతుందో అర్ధం కావడం లేదు అని కొందరు తీవ్రమైన వ్యాఖ్యలు సంధించారు.

  నన్ను వేశ్య అంటారా?

  నన్ను వేశ్య అంటారా?

  తనపై నెటిజన్లు ట్రోల్ చేయడంపై ఇషా గుప్తా స్పందిస్తూ.. నన్ను వేశ్య అని కామెంట్ చేయడం భారతీయ సంస్కృతికి చిహ్నమా? సరైన చదువు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. మహిళలు రెచ్చగొట్టే వాళ్లు అనుకోవడం వారి మానసిక పరిస్థితికి అద్దం పడతున్నది అని ఇషాగుప్తా అన్నారు.

  చేతిలో సినిమా అవకాశాలు లేక

  చేతిలో సినిమా అవకాశాలు లేక

  ఇక ఇషా గుప్తా కెరీర్ విషయానికి వస్తే పెద్దగా సినిమాలు లేవనే మాట వినిపిస్తున్నది. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా రూపొందిస్తున్న పల్టాన్ చిత్రంలో ఇషా నటించిన ఆ చిత్రం ఘోరంగా బోల్తా పడింది. ప్రస్తుతం ఇందర్ కుమార్ రూపొందిస్తున్న కామిక్ చిత్రం టోటల్ ఢమాల్ అనే సినిమాలో నటిస్తున్నది.

  English summary
  Esha Gupta cranked up the degrees by going topless in a series of eye-catching photos taken by photographer Rahul Jhangiani. In the pictures, she is seen wearing a pair of boyfriend jeans with her Calvin Klein underwear peeking through.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X