‘పెటా’ కోసం పెట్రేగిపోతున్న భామల్లో ఈమె కూడా...
ముంబై : 'పెటా' పేరు వినగానే అందమైన భామలు హాట్ అండ్ సెక్సీ అందాల ఆరబోతతో పెట్రేగిపోవడం ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో చూసాం. అయితే ఈ అందాల ప్రదర్శన వెనక ఒక మంచి ఉద్దేశ్యం ఉండటంతో 'పెటా' సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది.
'పెటా'(PETA) సంస్థ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదనుకుంటా. జంతుల హక్కుల కోసం పోరాడే ఈ అంతర్జాతీయ సంస్థకు చాలా మంది సెలబ్రిటీలు తమదైన రీతిలో ప్రచారం చేస్తుంటారు. జంతువులను హింసించ కూడదని, వాటిని చంపి తినకూడదని, మనషి స్వార్థం కోసం వాటిని వాడు కోకూడదని, అవి కూడా మన తోటి జీవులే... మనలాగే వాటికీ జీవించే హక్కు ఉంది, వాటిని ప్రేమించండి అనేది ఈ సంస్థ సిద్ధాంతం.

తాజాగా 'పెటా' కోసం అందాలతో పెట్రేగిపోతున్న భామల లిస్టులో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా కూడా చేరింది. మాంసం తినడం మానేయండి....శాఖాహారులుగా మారండి అని బికీనీ వేసుకుని ప్రచారం చేస్తోంది ఇషా గుప్తా. ప్రస్తుతం ఇషా కూడా పూర్తిగా శాఖాహారిగా మారిందట.
మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే శాఖాహారం తినడమే మేలని, మాంసాహారం తినేవారికంటే శాఖాహారం తినే వారు కనీసం 10 సంవత్సరాల ఎక్కువ జీవిస్తారని ఇషా గుప్తా ప్రచారం చేస్తుంది. ముక్కలేనిదే ముద్ద దిగని ఆమె అభిమానులకు ఇది కాస్త మింగుడు పడని అంశమే!


Click it and Unblock the Notifications











