Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఫస్ట్ టైం రిస్క్ తీసుకోలేదు.. రష్మీ గురించి ప్రభాకర్ అలా అనేశాడేంటీ.. (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)
ఈటీవీ ప్రభాకర్ సినీ దర్శకుడిగా మారి నెక్ట్స్ నువ్వే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆది సాయికుమార్, రష్మీ గౌతమ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన నెక్ట్స్ నువ్వే
బుల్లితెరపై మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ప్రభాకర్. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీలో సీరియళ్లు, రియాల్టీ షోలతో ఇరుగదీసిన ప్రభాకర్ తన ఇంటిపేరును ఈటీవీగా మార్చుకొన్నాడు. ఈటీవీ ప్రభాకర్‌గా తెలుగు వీక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ఆయన ప్రస్తుతం సరికొత్త అవతారాన్ని ఎత్తారు.
Recommended Video
ఈటీవీ ప్రభాకర్ సినీ దర్శకుడిగా మారి నెక్ట్స్ నువ్వే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆది సాయికుమార్, రష్మీ గౌతమ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన నెక్ట్స్ నువ్వే నవంబర్ 3న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే..
ఆ నలుగురు అండతోనే..
నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీవాసు, స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్, యూవీ క్రియేషన్ వంశీ నలుగురు కలిసి నిర్మిస్తున్నారు. కాన్సెప్ట్ చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. దాంతో చాలా కష్టపడి కథ, స్క్రీన్ ప్లేను చక్కగా సమకూర్చాం. కథ, పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నాం.
ఫస్ట్‌టైం రిస్క్ తీసుకోలేకోపోయాను
దర్శకుడిగా నెక్ట్స్ నువ్వే నాకు తొలి అవకాశం. కాబట్టి ఎక్కువగా రిస్క్ తీసుకోలేకపోయాను. అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ చిత్రం అందర్ని ఆకట్టుకొంటుందనే భరోసా, నమ్మకం ఉంది. ఇందులో ఆది సాయికుమార్, రష్మీ గౌతమ్, అవసరాల శ్రీనివాస్, హిమజ అందరూ బాగా చేశారు. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి.
హీరోయిజం ఉండదు
నెక్ట్స్ నువ్వే చిత్రంలో ఏ పాత్రలోనూ హీరోయిజం ఉండదు. కథానుగుణంగా డ్రామా కరెక్ట్‌గా ప్లే అవుతుంది. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్. కేవలం ప్రధాన కథను తీసుకొని సినిమాకు అనేక మార్పులు చేశాం. తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఉండేందుకు 75 శాతం కథను మార్చాం.
పేరున్న హీరో, హీరోయిన్లు
ప్రేక్షకులను సినిమాను రప్పించడానికి పేరున్న హీరో, హీరోయిన్లు ఉండాలన్న నిజమే కానీ అరవింద్, బన్నీవాసు, వంశీ, జానవేల్ లాంటి ప్రముఖులు అండగా ఉండటం కారణంగా దాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోలేదు.
ముఖం చూసి సినిమా కొంటారా?
నేను కూడా ఫస్ట్ టైం డైరెక్టర్. నా ముఖం చూసి సినిమా కొంటారా.. పెద్దవాళ్లు ఉన్నారనే ధైర్యంతోనే ఈ సినిమాను ప్రారంభించాం. వారు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారనే ప్లాన్‌తోనే ఆది సాయికుమార్‌ను హీరోగా, రష్మీని హీరోయిన్గా పెట్టుకొన్నాం.
రష్మీ సినిమాకు ఎసెట్
రష్మీ గౌతమ్ ఈ సినిమాకు చాలా ఎసెట్. యూత్‌లో ఆమెకు మంచి ఫాలోయింగ్. ఈ చిత్రంలో రష్మీది మంచి గ్లామర్ ఉన్న పాత్ర. జబర్దస్థ్ రియాలిటీ షోతో ప్రతీ ఇంటికి ఆమె చేరువైంది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే రష్మీని తీసుకొన్నాం.
రష్మీనే అడగండి
నేను రెచ్చగొడుతాను అని రష్మీ చెప్పిన సమాధానంపై ప్రభాకర్ స్పందిస్తూ.. ఆమె ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసిందో తెలియదు. ఆమెను అడిగితేనే తెలుస్తుంది. నాకు తెలిసిన ప్రకారం నెక్ట్స్ నువ్వే చిత్రంలో రష్మీది హీరోను రెచ్చగొట్టే పాత్ర. ప్రేక్షకులు హీరోగా ఫీలయితే వారిని రెచ్చగొట్టినట్టు ఫీలవుతారు అనే ఉద్దేశంతో రష్మీ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని ప్రభాకర్ అన్నారు.
ఆ నలుగురికి నమ్మకం
నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని నాకు అప్పగించేటప్పుడు నాపై బాగా నమ్మకం ఆ నలుగురు నాపై బాగా నమ్మకం పెట్టుకొన్నారు. వారి నమ్మకానికి ఏమాత్రం భంగం కలుగకుండా నా బాధ్యతను నెరవేర్చాను. అందుకే నాపై వారికి మంచి అభిప్రాయం కలిగింది. సెట్లో కూడా నా గురించి అందరూ బాగా చెప్పారు. దాంతో వారికి నాపై మరింత నమ్మకం కుదిరింది.
నటీనటులతో బాగా కుదిరింది
స్వతహాగా నేను నటుడిని కావడం వల్ల సెట్లో నటీనటులతో బాగా కుదిరింది. వారి నుంచి నటనను రాబట్టుకోవడం చాలా సులభమైంది. ఏ మేరకు వారి నుంచి నటనను రాబట్టుకోవాలన్న విషయంపై అవగాహన ఉండటం వలన ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.
మారుతి రెండో సినిమా ఇచ్చారు
ఇలాంటి పాజిటివ్ అంశాల కారణంగా మొదటి సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమా అవకాశం లభించింది. అందుకు కారణం కూడా బన్నీ వాసుగారే. నా గురించి ఆయన చెప్పిన విధానంతోనే మారుతి నన్ను నమ్మి నాకు రెండో సినిమా అవకాశం ఇచ్చారు.