For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమన్ మరణం తీరని లోటు.. దేవుడు వేసిన శిక్ష.. అల్లు శిరీష్ దేవుడు.. ప్రభాకర్ (ఇంటర్వ్యూ)

  By Rajababu
  |

  టెలివిజన్ రంగంలో మెగాస్టార్‌గా పేరు సంపాదించుకొన్న నటుడు, యాంకర్ ప్రభాకర్ ప్రస్తుతం సరికొత్త అవతారాన్ని ఎత్తారు. ఈటీవీ ప్రభాకర్ సినీ దర్శకుడిగా మారి నెక్ట్స్ నువ్వే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆది సాయికుమార్, రష్మీ గౌతమ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన నెక్ట్స్ నువ్వే నవంబర్ 3న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే..

  Next Nuvve Movie Theatrical Trailer నెక్ట్స్ నువ్వే హాట్ హాట్ ట్రైల‌ర్!
   అల్లు శిరీశ్‌కు ఓ కథ చెప్పాను.

  అల్లు శిరీశ్‌కు ఓ కథ చెప్పాను.

  దర్శకుడిగా మారుదామనే క్రమంలో అల్లు శిరీశ్‌కు ఓ కథ చెప్పాను. ఆ కథ అప్పుడే వద్దనుకొని వేరే వాళ్లతో మా బ్యానర్‌లో సినిమా చేద్దా అని చెప్పారు. ఆ తర్వాత అల్లు అరవింద్‌కి కథ చెప్పాను.
  కథ నచ్చడంతో పూర్తిగా డెవలప్ చేసి బన్నీవాసును కలువమని చెప్పారు. ఆ తర్వాత బన్నీవాసుకు కథ చెప్పగా ఆయన కరుణాకరన్ కథ చెప్పినట్టు ఉంది. కానీ ఆ కథ ఇప్పుడే వద్దు. తమిళ సినిమా రీమేక్ చేద్దాం అని సలహా ఇచ్చారు.

  శబరిమలైలో సమస్య తీరింది

  శబరిమలైలో సమస్య తీరింది

  తమిళ సినిమా కథపై కూర్చొని దాదాపు ఎనిమిది నెలలు వర్క్ చేశాం. కానీ తెలుగు రైట్స్ విషయంలో ప్రాబ్లెం వచ్చింది. దాంతో కొంచెం గ్యాప్ ఏర్పడింది. గతేడాది నేనూ, బన్నీవాస్‌ కలిసి శబరిమలై వెళ్లాం. అక్కడా ఆ సినిమా సమస్య క్లియర్‌ కాలేదని చెప్పారు. అయ్యప్ప దర్శనం చేసుకుని బయటికొచ్చే సరికి రీమేక్‌ రైట్స్‌ ప్రాబ్లమ్‌ క్లియర్‌ అని మెసేజ్‌ వచ్చింది. దాంతో నెక్ట్స్ నువ్వే సినిమా పట్టాలపైకి ఎక్కింది.

  నెక్ట్స్ నువ్వే కథ ఏమింటంటే..

  నెక్ట్స్ నువ్వే కథ ఏమింటంటే..

  నెక్ట్స్ నువ్వే కథ విషయానికి వస్తే నాలుగు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. హరర్ స్టోరీలో కాస్తా డిఫరెంట్. ప్రేక్షకుడు ఓ పక్క భయపడుతూనే నవ్వుకునే సినిమా ఆది, రష్మీలకు మంచి పేరు వస్తుంది. రొటీన్‌ సినిమాలు తీస్తే ఆదరించే రోజులు పోయాయి. కాన్సెప్ట్‌ సినిమాలదే హవా అని ప్రభాకర్ అన్నారు.

  సాయి కార్తీక్ మ్యూజిక్ హైలెట్

  సాయి కార్తీక్ మ్యూజిక్ హైలెట్

  నెక్ట్స్ నువ్వే సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు. కేవలం రెండు పాటలే అయినా 20 పాటలు ఇచ్చినంత ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. హారర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రంలో సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది.

  అవసరాలది అద్భుతమైన రోల్

  అవసరాలది అద్భుతమైన రోల్

  నెక్ట్స్ నువ్వే చిత్రంలో అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఆయనది. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి పాత్రను అద్భుతంగా చేశారు. ఆ పాత్రకు మంచి పేరు వస్తుంది. ఎవరూ కూడా ఊహించని విధంగా ఆయన రోల్ ఉంటుంది.

  నా ఉన్నతికి కారణం వీరే..

  నా ఉన్నతికి కారణం వీరే..

  యాంకర్‌గా, నటుడిగా, నిర్మాతగా ఎదుగడానికి ప్రతీ స్టేజ్‌లో ఒకరు ఉన్నారు. సినిమా పరిశ్రమకు వచ్చిన రోజుల్లో సీనియర్ నటులు ప్రదీప్, దర్శకురాలు మంజులానాయుడు ఆదరించారు. కమెడియన్, హీరో శ్రీనివాస్‌రెడ్డి నాకు రూమ్‌మేట్. ఈటీవీలో చేరిన తర్వాత సుమన్ గారు నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సమయంలోనే నేను నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకొన్నాను. విపరీతమై గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత స్వప్నదత్, జీటీవీ సంజీవరెడ్డి, నా స్నేహితులు సురేశ్, ప్రేమ్ సాగర్, శివకుమార్ వీళ్లందరూ నా ఉన్నతికి కారణం అని గర్వంగా చెప్పుకొంటాను.

  అల్లు శిరీష్ దేవుడిలా ఛాన్స్

  అల్లు శిరీష్ దేవుడిలా ఛాన్స్

  నెక్ట్స్ నువ్వే సినిమా అవకాశం రావడానికి కారణం అల్లు శిరీష్. నాతో పెద్దగా పరిచయం లేకపోయినా దేవుడిలా అవకాశం ఇప్పించాడు. నా టాలెంట్ నచ్చి నాకు ఛాన్స్ ఇప్పించాడు. అందుకు అల్లు శిరీష్‌కు రుణపడి ఉంటాను.

  సుమన్ లేని లోటు తీరనిది

  సుమన్ లేని లోటు తీరనిది

  జీవితంలో రామోజీ రావు కుమారుడు సుమన్‌ని కోల్పోవడం తీరని లోటు. ఒకరకంగా దేవుడు నాకు విధించిన శిక్ష. జీవితాంతం ఆ లోటు ఉంటుంది. సుమన్‌ను తలచుకోని రోజు లేదు. నా జీవితంలో అలా జరుగుకుండా ఉండాల్సింది. రామోజీరావుతో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఆయనకు నేను నచ్చలేదు. అందుకే బయటకు వచ్చాను. అప్పటి నుంచి ఆయనను మరోసారి కలువలేదు. సుమన్ మరణించినప్పుడు ఆయనను చూసి వెనకు వచ్చాను. రామోజీరావును మందలించలేదు.

  యాక్టింగ్‌, యాంకరింగ్‌ను కొనసాగిస్తా..

  యాక్టింగ్‌, యాంకరింగ్‌ను కొనసాగిస్తా..

  యాక్టింగ్, యాంకరింగ్‌కు పుల్ స్టాప్ పెట్టలేదు. డైరెక్టర్‌గా బిజీగా అయినా టీవీ రంగాన్ని వదిలేసే ప్రశ్న లేదు. సినీ రంగంలో కొనసాగుతూనే టెలివిజన్ రంగంలో కూడా కొనసాగుతాను. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌లాంటి స్టార్‌ హీరోలు టీవీ షోలను సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నారు. పెద్ద వాళ్లే చేస్తున్నప్పుడు నేనెందుకు మానుకుంటాను. నేనేదీ ప్లాన్‌ చేసుకోను. నా దగ్గరకు వచ్చిన పనిని మాత్రం వదలకుండా ఇష్టపడి చేస్తాను.

  రెండింటికి తేడా అదే..

  రెండింటికి తేడా అదే..

  టెలివిజన్ రంగానికి, సినిమా రంగానికి కొన్ని తేడాలు ఉన్నాయి. టెలివిజన్ రంగంలో చాలా వేగంగా పనిచేస్తాం. సినిమా విషయానికి వస్తే క్వాలిటీ కోసం నెమ్మదిగా పనిచేస్తాం. సినిమాను వందసార్లైనా చూస్తాం. కానీ టీవీ సీరియల్‌ను ఒకసారే చూస్తాం. అంతకంటే పెద్దగా ఏమీ లేదు.

  జెమినీలో రియాలిటీ షో

  జెమినీలో రియాలిటీ షో

  మారుతితో సినిమా పూర్తయిన తర్వాత జెమినీ టెలివిజన్‌లో రియాలిటీ షోకు ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే ఆ షోను ప్రారంభిస్తాను. తద్వారా మళ్లీ టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గర అవుతాను. సీరియల్‌ కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉన్నాను. కాలం కలిసి వస్తే సినీ నిర్మాతగా మారుతాను. మళ్లీ టెలివిజన్ సీరియల్స్‌ను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాను.

  English summary
  ETV Prabhakar is mega star on the Telugu Television Industry. He played many roles on small screen. Now He becomes director for the Next Nuvve movie. This movie is set to release on November 3rd. In this occassion, Prabhakar speaks to Telugu Filmibeat exclusively and said this comedy movie will attract the all sections of the audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X