చిరంజీవి వల్ల పస్తులున్నా.. రామ్ చరణ్ రాకపోయుంటే, మెగా ఫ్యామిలీపై ఈటీవీ ప్రభాకర్ కామెంట్స్
తెలుగువారికి దశాబ్ధాలుగా వినోదాన్ని అందిస్తూ వారి జీవితంలో భాగమైన ఈటీవీ ద్వారా ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు , దర్శకులు, గాయనీ గాయకులు పరిచయమై ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిలో ఒకరు ప్రభాకర్ ఒకరు. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. ప్రభాకర్ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చేమో కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు.
టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈటీవీ అప్పుడప్పుడే నడక ప్రారంభించిన కొత్తలో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇప్పటికీ ఫిలింసిటీలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలోనే ఛైర్మన్ రామోజీరావు ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని.. అందుకే ఈటీవీ నుంచి తప్పించారని ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారు.

ఈటీవీ నుంచి తప్పుకున్నా.. జెమినీ, మాటీవీ, జీ తెలుగు వంటి సంస్థలలో ప్రభాకర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ నటిస్తున్నారు. తన కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేశారు. కొన్నేళ్ల క్రితం ప్రభాకర్ ఆయన భార్య మలైజాలు మీడియా సమావేశం పెట్టి మరి ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ సమయంలో చంద్రహాస్ హావభావాలు, యాటిట్యూడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మీమ్స్‌తో చంద్రహాస్‌ను నెటిజన్లో ఓ ఆట ఆడుకున్నారు.
ఎలాగైనా కొడుక్కి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్, మలైజాలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసి 'రామ్ నగర్ బన్నీ ' అనే సినిమా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందిస్తుండగా.. అక్షర్ అలీ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్‌లుక్‌లో ఉన్న చంద్రహాస్ గ్లిమ్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కచ్చితంగా ఈ సినిమాతో చంద్రహాస్ క్లిక్ అవుతాడని ప్రభాకర్ ఫ్యామిలీ ధీమగా ఉంది.

ఇదిలాఉండగా.. ఓ ఇంటర్వ్యూలో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడు.. తాను మెగాస్టార్ చిరంజీవికీ వీరాభిమానిని అని చెప్పారు. చిన్నప్పటి నుంచి చిరు సినిమాలు చూస్తూ పెరిగిన ఆయన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైతే నేను ఎలా బ్రతకాలి అని బాధపడ్డానని చెప్పారు. చిరు సినిమాలు మానేశాడని తెలియగానే రెండ్రోజులు అన్నం తినలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక టైంలో చిరంజీవికి 100 డిస్ట్రబెన్స్ ఉన్నాయని.. కానీ కరెక్ట్ టైంలో చరణ్ దిగి.. డే అండ్ నైట్ కష్టపడి మగధీరతో కొడితే మెగాస్టార్ కొడుకొచ్చాడు రా అని అనిపించిందని ప్రభాకర్ అన్నారు.
రామ్ చరణ్ వల్ల మొత్తం మెగా ఫ్యామిలీ గెట్ బ్యాక్ అయ్యిందన్నారు. చిరంజీవి కొడుకుగా పుట్టాడు, పేరు నిలబెట్టాలి.. ఒక చిన్న తప్పు చేసినా కష్టమని.. పేరును కాపాడటమే పెద్ద బాధ్యతని కానీ రామ్ చరణ్ ఆ ప్రెజర్ తీసుకున్నాడని ప్రభాకర్ ప్రశంసించారు. కాలేజీకి వెళ్లే పిల్లలు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి రామ్ చరణ్ అని చెప్పారు. రామ్ చరణ్‌ని చూస్తే .. ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకుంటే ఆ తండ్రి జీవితం సార్ధకమని ప్రశంసించారు. ప్రస్తుతం ఈటీవీ ప్రభాకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











