Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఆంజనేయులు’ లో ఈటీవీ ప్రభాకర్, జె.పి
టీ.వీ చానల్ లో మోస్ట్ పాపులర్ యాక్టర్, నటుడు ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్ గా మంచి పేరు సంపాదించుకొన్నారు. మొదట ఈటీవీలో పనిచేశారు, తర్వాత లోకల్ గా పనిచేశారు. ఇప్పుడు జీ తెలుగు పని చేస్తున్నారు. ఈ చిత్రంలోని 'పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు" అని టైటిల్స్ ముందు పడుతుంది. ఒకవేళ ఎవరి జీవితాల్లోకైనా తొంగి చూస్తేనో? జరిగిన సంఘటనలను వాడుకుంటేనో ఇలా 'ఎవరినీ ఉద్దేశించినవి కావు" అని వేస్తారు కాబోలు! లేకుంటే అ అవసరం ఉండదు కదా! 'ఆంజనేయులు" చిత్రం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.
లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్, ఈటీవీ ప్రభాకర్ జీవితాలు రెండు పాత్రల ద్వారా ప్రతిబింబించారు. జె.పి.గా ప్రకాష్ రాజ్ నటించాడు. ఈటీవీ ప్రభాకర్ గా బ్రహ్మానందం నటించాడు. దర్శకుడు పరశురామ్ ధైర్యం చేసి సినిమాలో కూడా ఆయా పాత్రలకు 'జయప్రకాష్", 'ప్రభాకర్" అని నిజం పేర్లనే పెట్టాడు. ఐ.ఏ.యస్. చదివి రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తూ రాజకీయ నాయకుల అవినీతి సహించలేక జరుగుతున్న అక్రమాలు చూడలేక స్వచ్చందంగా పదవికి రాజీనామా చేస్తాడు ప్రకాష్ రాజ్.
పుస్తకాల్లో చదువుకున్న చదువు వేరు, ప్రాక్టికల్ గా జరుగుతున్నది వేరంటారు. లోక్ సత్తా జె.పీ నిజ జీవితాన్ని ఈ క్యారెక్టర్ పోలి ఉంటుంది. సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటున్న ప్రభాకార్ ఈటీవీ ఎం.డి.సుమన్ కు సన్నిహితుడయ్యాడు. ఈటీవీ క్రియేటివ్ హెడ్ గా పదవి చేపట్టాడు. కొన్ని కారణాల వల్ల రిజైన్ చేశాడు. తెలుగులో "ముద్దుబిడ్డ' సీరియల్ లో పాపులర్ సీరియల్ అయింది తర్వాత సినిమా రంగంలో ప్రవేశించారు.