twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈటీవీ సుమన్-విలన్

    By Staff
    |

    ETV Suman
    రామోజీరావు గారి కుమారుడు ఈటీవీ సుమన్ తాజాగా నాన్ స్టాఫ్ అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన ప్రతినాయకుడు(విలన్)పాత్ర చేస్తున్నట్లు సమాచారం. నవనీత్ కౌర్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో సుమన్ పాత్ర హైలెట్ అయ్యేలా ప్రత్యేకమైన మేకప్, డైలాగులు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని సుమన్ తన స్వీయ బ్యానర్ సుమన్ ప్రొడక్షన్స్ పైనే నిర్మిస్తున్నాడు. అలాగే నూతన దర్శకుడుని పరిచయం చేస్తున్న ఈ సినిమా వినోద ప్రధానంగా నాన్ స్టాఫ్ నవ్వులు కురిపిస్తుందని అంటున్నారు.

    ఇక ఇప్పటికే సమన్ ప్రధాన పాత్రలో చేసిన ఉషా పరిణయం సినిమా పబ్లిసిటీతో హోరెత్తుతోంది. ఇన్నాళ్ళు ఉషాకిరణ్ పై చిత్రాలు నిర్మించిన రామోజిరావు ఈ సుమన్ ప్రొడక్షన్స్ కి సంభందం లేనట్లుగా ఉంటున్నారని సమాచారం. అంతా తానై, అన్నా తానై సుమన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని ముందుకు తీసుకెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమ ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మితమవుతాయని ఆయన చెప్తున్నారు. అందుకు దర్శకుల ఎంపిక జరుగుతోంది. అయితే పేరున్న దర్శకులు ఎవరూ కూడా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X