సినిమాతో ఈటీవి సుమన్

అయితే నేనే కథకుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, గీత రచయితగా ఉండాలనే నియమం ఏమీ లేదు. కానీ..పౌరాణికాలు అయితే నేనే చేస్తా. వాటిపై అవగాహన కొద్ది మందికే ఉంది. వాటిని నాటకీయంగా చెప్పి వినోదాన్ని పంచడం అంత సులభం కాదు. ఆ గాథల్ని తెరకెక్కించాలనుకొంటే నేనే నటించి, దర్శకత్వం వహిస్తాను అన్నారు.అలాగే మరొకరుకి అవకాశమివ్వరా అంటే..కథ నచ్చి, నేను అనుకున్న విలువలకు తగ్గట్టు ఉండి, దర్శకత్వం చేయగలరన్న నమ్మకం కలిగితే తప్పకుండా మరొకరికి అవకాశం ఇస్తాను.
అంటే మీరు నిర్మించే చిత్రాల్లో మీ పాత్ర ప్రధానంగా ఉండాలా? అన్నదానికి నేను తప్పకుండా నటించాలని ఏమీ లేదు. కథలో ఏదన్నా పాత్ర నచ్చి, నేను చేస్తే బాగుంటుందీ అనిపించి, అది సినిమాకు కలిసొస్తుంది అనుకొంటే చేస్తాను. అది చిన్న పాత్రయినా కావచ్చునని అన్నారు. మరి బయిట చిత్రాల్లో అంటే..ఆ పాత్ర నచ్చి, నా అభిరుచులకు తగ్గట్టుగా ఉండి, ఆ దర్శకుడు నాతో చేయించగలడు అనిపిస్తే ఒప్పుకొంటాను అన్నారు. ఇక ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాకర్ ఉంటాడా ఉండడా అన్నది కూడా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











