twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాతో ఈటీవి సుమన్

    By Staff
    |

    Usha Parinayam
    రచన, నటన, సంగీతం, దర్శకత్వం అంటూ అన్ని తానే చేసేసి టీవి సీరియల్స్ తో ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టిన ఈ టీవీ సుమన్ ఈసారి సినిమా ద్వారా మన ముందుకొస్తున్నాడు.'ఉషా పరిణయం" చిత్రంతో తన అభిమానులు(ఎవరైనా ఉంటే) పలకరించబోతున్నారు. ఈ పౌరాణిక వర్ణచిత్రంలో శ్రీకృష్ణుడిగా ఆయన నటించారు. రచన, దర్శకత్వం, సంగీతం, నిర్మాణ బాధ్యతలు సుమన్‌ నిర్వర్తించారు. ఇక ఆయన హఠాత్తుగా టీవీ నుంచి సినిమాల వైపు రావడానికిగల కారణం చెపుతూ..మొదట్నించీ నాకు సినిమాలంటే ఇష్టం..అయితే...ఛానెల్‌ ప్రారంభించడం, వాటికి సంబంధించిన సీరియల్స్ తయారుచేయడంతో సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు సీరియల్స్‌తోపాటు సినిమాలు కూడా చేయాలని నిర్ణయించుకున్నాను అంటున్నారు.

    అయితే నేనే కథకుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, గీత రచయితగా ఉండాలనే నియమం ఏమీ లేదు. కానీ..పౌరాణికాలు అయితే నేనే చేస్తా. వాటిపై అవగాహన కొద్ది మందికే ఉంది. వాటిని నాటకీయంగా చెప్పి వినోదాన్ని పంచడం అంత సులభం కాదు. ఆ గాథల్ని తెరకెక్కించాలనుకొంటే నేనే నటించి, దర్శకత్వం వహిస్తాను అన్నారు.అలాగే మరొకరుకి అవకాశమివ్వరా అంటే..కథ నచ్చి, నేను అనుకున్న విలువలకు తగ్గట్టు ఉండి, దర్శకత్వం చేయగలరన్న నమ్మకం కలిగితే తప్పకుండా మరొకరికి అవకాశం ఇస్తాను.

    అంటే మీరు నిర్మించే చిత్రాల్లో మీ పాత్ర ప్రధానంగా ఉండాలా? అన్నదానికి నేను తప్పకుండా నటించాలని ఏమీ లేదు. కథలో ఏదన్నా పాత్ర నచ్చి, నేను చేస్తే బాగుంటుందీ అనిపించి, అది సినిమాకు కలిసొస్తుంది అనుకొంటే చేస్తాను. అది చిన్న పాత్రయినా కావచ్చునని అన్నారు. మరి బయిట చిత్రాల్లో అంటే..ఆ పాత్ర నచ్చి, నా అభిరుచులకు తగ్గట్టుగా ఉండి, ఆ దర్శకుడు నాతో చేయించగలడు అనిపిస్తే ఒప్పుకొంటాను అన్నారు. ఇక ఈ పౌరాణిక చిత్రంలో ప్రభాకర్ ఉంటాడా ఉండడా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X