ఈటీవీ సుమన్ విశ్వరూపం

ఇక ఆయన హఠాత్తుగా టీవీ నుంచి సినిమాల వైపు రావడానికిగల కారణం చెపుతూ..మొదట్నించీ నాకు సినిమాలంటే ఇష్టం..అయితే...ఛానెల్ ప్రారంభించడం, వాటికి సంబంధించిన సీరియల్స్ తయారుచేయడంతో సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు సీరియల్స్‌తోపాటు సినిమాలు కూడా చేయాలని నిర్ణయించుకున్నాను అంటున్నారు.
అయితే నేనే కథకుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, గీత రచయితగా ఉండాలనే నియమం ఏమీ లేదు. కానీ..పౌరాణికాలు అయితే నేనే చేస్తా. వాటిపై అవగాహన కొద్ది మందికే ఉంది. వాటిని నాటకీయంగా చెప్పి వినోదాన్ని పంచడం అంత సులభం కాదు. ఆ గాథల్ని తెరకెక్కించాలనుకొంటే నేనే నటించి, దర్శకత్వం వహిస్తాను అన్నారు.అలాగే మరొకరుకి అవకాశమివ్వరా అంటే..కథ నచ్చి, నేను అనుకున్న విలువలకు తగ్గట్టు ఉండి, దర్శకత్వం చేయగలరన్న నమ్మకం కలిగితే తప్పకుండా మరొకరికి అవకాశం ఇస్తాను.
ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే బాణాసురుడనే రాక్షసరాజు కూతురు ఉష. ఆమెకి కల్లో ఓ అందమైన యువకుడు కనిపిస్తాడు. అతణ్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని అతనెవరో తెలీక విరహంతో ఉష బాధపడుతూ ఉండగా-ఆమె స్నేహితురాలు చిత్రరేఖ సాయం చేస్తానంటుంది. అతనెవరో కనుక్కొని తన మాయలతో ఉష ముందు నిలబెడతానని మాటిస్తుంది. అందుకు చిత్రరేఖ చేసే ప్రయత్నం ఏమిటో అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందన్నదే ప్రధాన కథాంశం. ఇంతకీ ఈటీవి సుమన్ ని పెద్ద తెరపై ఏ విధంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నవిషయం ఈరోజు తేలనుంది.


Click it and Unblock the Notifications











