ఆమెతో ఈటీవీ సుమన్ నాన్ స్టాఫ్ గా

By Staff

Suman
నవనీత్ కౌర్ తో ఈటీవీ సుమన్ నాన్ స్టాఫ్ అనే సినిమా చేయటానికి సన్నాహాలు చేయబోతున్నాడు. సుమన్ ప్రధాన పాత్రలో మొదలయ్యే ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులు, దర్శకుడు పరిచయం కానున్నారని సమాచారం. ఇక సమన్ ప్రొడక్షన్స్ పై నిర్మితమయ్యే ఈ చిత్రంకి ఆయనే పెట్టుబడి పెట్టనున్నారు. జూన్ నుంచి మొదలయ్యే ఈ సినిమా వినోద ప్రధానంగా నాన్ స్టాఫ్ నవ్వులు కురిపిస్తుందని సమాచారం. ఇక ఇప్పటికే సమన్ ప్రధాన పాత్రలో చేసిన ఉషా పరిణయం సినిమా పబ్లిసిటీతో హోరెత్తుతోంది. ఇన్నాళ్ళు ఉషాకిరణ్ పై చిత్రాలు నిర్మించిన రామోజిరావు ఈ సుమన్ ప్రొడక్షన్స్ కి సంభందం లేనట్లుగా ఉంటున్నారని సమాచారం. అంతా తానై, అన్నా తానై సుమన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ని ముందుకు తీసుకెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమ ప్రొడక్షన్ హౌస్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మితమవుతాయని ఆయన చెప్తున్నారు. అందుకు దర్శకుల ఎంపిక జరుగుతోంది. అయితే పేరున్న దర్శకులు ఎవరూ కూడా ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఎందుకంటే సుమన్ అన్ని విభాగాల్లోనూ వేలు పెట్టి తమ స్వేఛ్చకు భంగం కలిగిస్తాడని దాంతో ప్రొడక్ట్ సరిగా రాదని వారు బహిరంగంగానే కామెంట్స్ చేయటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X