twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈటీవీ సుమన్ నాన్ స్టాఫ్ గా...

    By Srikanya
    |

    ఈటీవీ సుమన్..తాజాగా 'నాన్‌స్టాప్‌' అనే కామిడీ చిత్రాన్నిసుమన్‌ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ కామిడీ. తెలుగు,తమిళ భాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఎం.జె.ఆర్‌ దర్శకుడు. ఈ 'నాన్‌స్టాప్‌' ద్వారా హీరో,హీరోయిన్స్ గా కొత్తవారు పరిచయమవుతున్నారు.షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ చిత్రం విశేషాలు మీడియాకు వివరించారు. ఈ మీట్ లో సుమన్ మాట్లాడుతూ.. ''సుమన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వస్తున్న పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. సకుటుంబంగా చూసేలా ఉంటుంది. సస్పెన్స్‌, వినోదం సమపాళ్ళలో ఉంటాయి. అలాగని హారర్‌ తరహా చిత్రం కాదు. ప్రస్తుతం చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం. సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 21న పాటల్ని విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని పాటలు అలరిస్తాయి. సినిమా మంచి ఆదరణ పొందుతుంద''న్నారు. ఇక ఈ చిత్రానికి స్క్రిన్ ప్లే రైటర్, క్రియోటివ్ డిజైనర్, ప్రాజెక్టు హెడ్ అయిన ఇంద్రనాగ్ కూడా ఈ చిత్రం విశేషాలు వివరించారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇంద్రనాగ్‌ వల్ల వచ్చింది. హింస, అశ్లీలత శ్రుతి మించుతున్న ఈ తరుణంలో అలాంటివి ఏమీ లేకుండా రూపొందిన సినిమా ఇది. తప్పకుండా అందరూ కలిసి చూసేలా ఉంటుంద''ని అన్నారు. అలాగే 'నాన్‌స్టాప్‌'లో ఎమ్మెస్‌ నారాయణ, సత్యం రాజేష్‌, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, మాస్టర్‌ భరత్‌, గౌతంరాజు, జూ||రేలంగి, శ్రీలలిత, పిళ్ళాప్రసాద్‌, అనంత్‌ తదితరులు నటిస్తున్నారు. పాటలు: కందికొండ, పోతుల రవికిరణ్‌, భోలే శావలి, సురేంద్ర, కూర్పు: ఏవీసీ శేఖర్‌, కళ: భాస్కర్‌, నిర్మాత: సుమన్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X