»   » ‘బాహుబలి' ఇక్కడే కాదు అక్కడ: డిస్ట్రిబ్యూటర్స్ పోటీ

‘బాహుబలి' ఇక్కడే కాదు అక్కడ: డిస్ట్రిబ్యూటర్స్ పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెచ్చుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకు యూరప్‌ మార్కెట్టే అందుకు ఉదాహరణ. ఈ చిత్రం పంపిణీ హక్కుల కోసం యూరప్‌లో డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా పోటీ పడుతున్నారని సమాచారం.


ఇప్పటికే చైనా, లాటిన్‌ అమెరికాల్లో అమ్ముడయిపోయిన ఈ సినిమా హక్కుల్ని యూరప్‌లో దక్కించుకోడానికి పలువురు పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు.


European distributors fight for the rights of Baahubali

భారతీయ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఇంతగా ఎదురు చూస్తుండటం భారత సినీ పరిశ్రమలకు మంచి పరిణామమని యూరోపియన్‌ డిస్ట్రిబ్యూటర్‌ పెర్రీ అసోలియన్‌ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాహుబలి-2 కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.


మరో ప్రక్క ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కు ప్రయాణం పెట్టుకుంది. 'బాహుబలి'అంతర్జాతీయ ప్రదర్శనల పరంపర కొనసాగుతోంది. ఆదివారం అమెరికాలోని హవాయ్‌ రాష్ట్రంలో జరుగుతున్న 'హవాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌'లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

English summary
"There's a great demand for Baahubali in Europe. Never before there's been so much demand for an Indian film. Several distributors are literally fighting to buy the film's rights. This is really good from Indian films' perspective," filmmaker and European distributor Pierre Assouline said here.
Please Wait while comments are loading...