టైటిల్స్ పెట్టడంలో శేఖర్ కమ్ములది సెపరేట్ స్టైల్. మంచి ఫీల్ తో పెట్టే ఆ టైటిల్స్ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తాయి. అదే కోవలో ఆయన త్వరలో తీయనున్న చిత్రానికి "ఎవరైనా..ఎప్పుడైనా..ప్రేమలో పడితే" అనే పెట్టారని సమాచారం. ప్రేమ సబ్జెక్ట్ అని టైటిల్ లోనే చెప్పి ధియోటర్స్ కి ఆకర్షిచటానికి ఈ టైటిల్ బాగా ఉపయోగపడుతుందనేది ఆయన ఫీలింగ్. ఆనంద్ సినిమాకీ మంచి కాఫీ లాంటి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టి ముందుగా నా సినిమా ఇట్లాంటి ఫీల్ తో ఉంటుందని చెప్పారు. అలాగే గోదావరి అనే టైటిల్ పెట్టడం ద్వారా మన తెలుగు తనాన్ని చూపెట్టబోతున్నాననే మెసేజ్ ని స్ప్రెడ్ చేయగలిగాడు. ఇక హ్యాపీడేస్ సంగతి సరేసరి. టైటిల్ వినగానే మంచి హ్యాపీ మూడ్ లో మన లైఫ్ లోని హ్యాపీ డేస్ ని గుర్తు చేసుకునేలా చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు ఈ టైటిల్ తోను మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం.