బూతు కామెంట్లు: హీరోయిన్‌ను వేధించిన కుర్రాళ్లు!
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఎవలీన్ శర్మకు తన సొంత దేశం జర్మనీలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల తన ఫ్యామిలీని కలిసేందుకు జర్మనీలోని ఫ్రంక్‌ఫర్ట్ పట్టణానికి వెళ్లిన ఎవలీన్ శర్మను అక్కడి కొందరు ఆకతాయి కుర్రాళ్లు వేధింపులకు గురి చేసారట. ఈ సంఘటన తనను ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేసిందని ఎవలీన్ శర్మ చెప్పుకొచ్చింది.
'నా జీవితంలో వన్ ఆఫ్ ది మోస్ట్ షాకింగ్ సంఘటన ఇది. ముఖ్యంగా ఫ్రంక్‌ఫర్ట్‌లోని మా ఇంటికి వెలుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఘటన నా జీవితంలో ఇదివరకెన్నడూ చోటు చేసుకోలేదు' అని ఎవలీన్ శర్మ చెప్పుకొచ్చింది.

'పట్ట పగలు ఈ సంఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు. అయితే అదృష్ట వశాత్తు ఆకతాయిల భారి నుండి తప్పించుకుని క్షేమంగా ఇంటికి చేరాను' అని ఎవలీన్ శర్మ తెలిపింది. ఎవలీన్ శర్మ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను కొందరు కుర్రాళ్లు వెంటపడి ఫోటోగ్రాఫ్స్ తీస్తూ వెంటబడ్డారని, ఆమె అభ్యంతరం చెప్పడంతో బూతులు మాట్లాడుతూ వేధించారని తెలుస్తోంది.
ఎవలీన్ శర్మ పూర్తి పేరు...ఎవలీన్ లక్ష్మి శర్మ. ఆమె తల్లిదండ్రుల్లో ఒకరు జన్మనీ, ఒకరు ఇండియాకు చెందిన వారు. బాలీవుడ్ చిత్రాలైన సిడ్నీ విత్ లవ్, యే జవానీ హై దివానీ, ఇష్క్, యారియాన్, మే తేరా హీరో చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో మంచి నటిగా, గ్లామర్ తారగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











