Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్ని కోట్లు కావాలి? డబ్బులిస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆపేస్తారా?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తీశారని, ఈ చిత్రం విడుదలైతే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఆరోపణలు చేస్తున్న తెలుగు దేశం పార్టీ వారు ఎలాగైనా విడుదల అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమా అడ్డుకునేందుకు ఎన్నికల సంఘానికి వారు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తన సినిమాను అడ్డుకోలేరని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ... ఈ వివాదంపై పలు టీవీ ఛానల్స్‌లో వరుసగా లైవ్ డిబేట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మకు ఓ వ్యక్తి నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.
టీడీపీ మద్దతు దారులకు ఏం మెసేజ్ ఇస్తారు?
టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.... ‘మెసేజ్ ఇవ్వడానికి నేను మెసెంజర్ కాదు. నేను ఒక సినిమా తీశాను. ఆ సినిమా చూసిన తర్వాత వాళ్లకు కలిగిన ఒక భావనలో నుంచి ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది వాళ్లు నిర్ణయించుకోవాలి. అంతే కానీ వాళ్లు ఏం ఫీలవ్వాలి, ఏం చేయాలని చెప్పడం నా ధర్మం కాదు' అన్నారు.
మూవీ బడ్జెట్ ఎంత?
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా బడ్జెట్ ఎంత? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి రామ్ గోపాల్ వర్మ నిరాకరించారు. నేను బడ్జెట్ చెబితే మీరు ఇన్‌కం టాక్స్ వాళ్లకి చెబుతారు. అందుకే నేను చెప్పను అని స్పస్టం చేశారు.
నెత్తిన చెత్త వేసుకున్నట్లే.. అంతకు మించి ఏమీ చేయలేరు, లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై నిర్మాత!
సినిమా ఆపాలంటే మీకు ఎంత డబ్బు కావాలి?
సినిమా ఆపాలంటే మీకు ఎంత డబ్బు కావాలి? ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలైతే ఎంత లాభం వస్తుందో... అంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తాం, సినిమా ఆపేయండి అని మీకు ఆఫర్ ఇస్తే సినిమాను ఆపేస్తారా? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఇప్పటి వరకైతే నాకు అలాంటి ఆఫర్ రాలేదు. వచ్చే వారం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మూమెంటులో ఆపే అవకాశం లేదని వర్మ స్పష్టం చేశారు.
వెన్నుపోటు పర్వం ప్రధానంగా...
ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ... రామారావు కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణమాలు ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పర్వాన్ని హైలెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఉండబోతోంది. మార్చి 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.