పవన్ పార్టీ సభపై పోలీసుల ఆంక్షలు

By Srikanya

Event for Media & few selected Pawan Fans with 'Bar Code' Pass system
హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మాదాపూర్‌లో నిర్వహించనున్న 'జనసేన' పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణపై సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. సభను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల్లోపు ముగించాలని సైబరాబాద్‌ డీసీపీ క్రాంతిరాణ టాటా ఆదేశించారు. 4 వేల పాసులు మాత్రమే జారీ చేయాలని సూచించారు. పాసులు ఉన్నవారినే సభకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.

శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8గంటల మధ్య హైదరాబాద్ హైటెక్స్ వేదికగా పవన్ 'జనసేన' ఆవిర్భవించనుంది. పూర్తి తెలుపుపై ఎర్రని చక్రంలో అదే రంగు నక్షత్రాన్ని (షట్ చక్రం) ముద్రించి... పార్టీ జెండాను రూపొందించారు. అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తేలా 'జనసేన' గీతాన్ని రూపొందించారు. ఎన్నికల గుర్తుగా వట వృక్షాన్ని ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాద్ సహా రాష్ట్రంలో 28 చోట్ల భారీ తెరలతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం బహిరంగ మైదానాలను, ఫంక్షన్ హాళ్లను ఎంచుకున్నారు. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సుమారు 50 నిమిషాలపాటు ప్రసంగించే అవకాశముంది.

పవర్ స్టార్ తన పార్టీని అధికారికంగా ప్రకటించేందుకు ఒక్కరోజు ముందే... జెండా, నినాదం, గీతం అన్నీ అనధికారికంగా విడుదలయ్యాయి. అంతేకాదు.. పార్టీ ఆవిర్భావానికి ముందే 'మెగా' కుటుంబంలో చిచ్చు మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు ఒక 'వీడియో ప్రకటన' విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో 'ఠాగూర్' సినిమాలోని 'నేను సైతం ప్రపంచాగ్నికి...' పాట మంద్రంగా వినిపిస్తుండగా నాగబాబు మాట్లాడారు.

'ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా... నేను, అభిమానులందరం అన్నయ్య చిరంజీవి వెంటే ఉన్నాం. అన్నయ్యా... వియ్ ఆర్ విత్ యూ' అని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి అభిమానులెవరూ రావొద్దంటూ తన పేరిట ఆదేశాలు వెళ్లినట్లు వచ్చిన వార్తలను చిరంజీవి ఖండించారు. ఇక... చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచిన కాపులు, పవన్ పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X