ఎవర్ గ్రీన్ అందగత్తె..పుట్టినరోజు నేడే

By Bojja Kumar

జగదేక సుందరి, ఇటు దక్షిణాది.. అటు ఉత్తరాది సినీ ప్రపంచాన్ని ఏలిన తార ఎవరంటే....ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ఎవర్ గ్రీన్ అందగత్తె శ్రీదేవి. పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లయినా.... ఏమాత్రం వన్నె తరుగని అందంతో ఇప్పటికీ సినీ వినీలాకాశంలో వెలుగొందుతున్నఅభిమానుల కలల రాణి ఆమె. నేడు శ్రీదేవి పుట్టిన రోజు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి నేడు 49వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి 'పదేహారేళ్ల వయసు" చిత్రం ద్వారా హీరోయిన్ పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు మళ్లీ వెను దిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలనాటి స్టార్ హీరోయిలు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావులాంటి వారితో.... ఆ తర్వాతి తరం నటులైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున స్టార్స్ తోనూ జత కట్టిన వైనం ఆమె వన్నె తరుగని అందానికి నిదర్శనం.

హిందీ చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన తర్వాత నిర్మాత బోణీ కపూర్ ను పెళ్లి చేసుకుని సినిమాల్లో నటించడం మానేసిన శ్రీదేవి తన ఇద్దరు కూతర్లు భావి హీరోయిన్లుగా తీర్చి దిద్దే పనిలో పడింది. మా కలల రాణి మరోసారి తెరపై కనిపించి కనువిందు చేయాలని అభిమానులు కోరుతుండటంతో త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తెరగ్రేటం చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఫ్యాషన్ షోలలో తళుక్కుమంటూ తన తెరంగ్రేటానికి మార్గం సుగమం చేసుకుంటోంది. మరి ఈ ఎవర్ అందగత్తె సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా సాగాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X