ట్రెండ్ సెట్ చేసిన లవకుశ సినిమా నాగరాజు ఇక లేరు
సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రతి ఒక్కరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. సోమవారం సీనియర్ నటుడు అనపర్తి నాగరాజు కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన చిత్రాల్లో లవకుశ ఒకటి. ఎన్టీఆర్, అంజలి దేవి రాముడు, సీత పాత్రల్లో నటించిన ఆ సినిమా 1963లో వచ్చింది. అయితే ఆ లవకుశ సినిమాలో లవుడి పాత్రలో అనపర్తి నాగరాజు నటించారు.
71 ఏళ్ల వయసు కలిగిన నాగరాజు సోమవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. ఇక లవకుశ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కోటి రూపాయలకు పైగా వసూళ్లను అందుకొని ఈ చిత్రం అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది.

ఇక సినిమాకు సి.పుల్లయ్య, సీఎస్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇక లవకుశ పాత్రల్లో నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం పాత్రలకు కూడా మంచి గౌరవం దక్కింది. వారికి పలు పురస్కారాలు కూడా అందాయి. ఇక నాగరాజు దాదాపు 340కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ తోనే 22చిత్రాల్లో నటించి అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











