»   » అందరి టార్గెట్ పవన్ కళ్యాణే, ఎదిగిపోవాలనే ప్లాన్!

అందరి టార్గెట్ పవన్ కళ్యాణే, ఎదిగిపోవాలనే ప్లాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజి ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీంతో అందరూ ఆయన్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే చాలు పెద్ద స్టార్ అయిపోవచ్చు. అందుకే పలువురు పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం దక్కించుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయడమే తన లక్ష్యమని, మంచి కథతో వస్తే దర్శకత్వం అవకాశం ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రచయిత కోన వెంకట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీవీ యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ కూడా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. మరి వీరు తాము అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారో? లేదో? కాలమే నిర్ణయించాలి.

సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కొందరి పాలిట కామధేవువయ్యాడు. నితిన్ లాంటి హీరోలు ఆయన్ను దేవుడిగా చూస్తారు. నితిన్‌కు మాత్రమే కాదు...పవన్ కళ్యాణ్ నిజంగానే కొందరి పాలిట దేవుడుగా మారాడనేది అభిమానుల అభిప్రాయం. ప్లాపుల బాటలో ఉన్న యువ హీరోలను హిట్ బాటలో నడిపించి దేవుడయ్యాడు. నిర్మాతలకు కనక వర్షం కురిపించి దేవుడు అయ్యాడు. మొత్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజిని పెంచి ధీరుడయ్యాడని అంటున్నారు.

English summary
TV anchor turned director Omkar has a big dream that to direct Power star Pawan Kalyan. He has failed to prove himself on big screen with his debut movie as director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu