మహేష్ ‘దూకుడు’ స్టైల్ ని ఫాలో అయ్యేదెంతమంది...!?
ఆడియో రిలీజ్ నుంచి సినిమా వరకు వాయిదా పడుతూ వచ్చిన మహేష్ బాబు 'దూకుడు" మొత్తానికి సెప్టెంబర్ 23న రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. 'పూవై పూవై.."అనే ఐటమ్ సాంగ్ ఇంకా పిక్ఛరైజ్ చెయ్యాల్సి వుంది. ఈ పాటని ఈనెల 6 నుంచి పిక్చరైజ్ చెయ్యబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ పాట కూడా కంప్లీట్ చేసి అనుకున్న టైమ్ కి సినిమాని రిలీజ్ చెయ్యాలని శ్రీను వైట్ల కూడా కంగారు పడుతున్నాడట. ఇప్పటికే బిజినెస్ మేన్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడంతో బిజీ అయిపోయిన మహేష్ ఈ ఐటమ్ సాంగ్ చేసేసి 'దూకుడు" షూటింగ్ కి గుడ్ బై చెబ్దామని చూస్తున్నాడు..కాగా దూకుడు 23న స్ర్కీన్ మీద పోకిరి మాదిరిగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని భారీ అంచనాలతో ఉన్నారు.
ఎందుకంటే ఇప్పటి వరకు చేయనటువంటి ఎంటర్టైన్ మెంట్ మహేష్ ఇందులో చేశాడని, అతని డిఫరెంట్ స్టైల్, బాడీ లాంగ్వేజి, అతని నడక అన్ని చూడ్డానికి డిఫరెంట్ గా ఉన్నాయని, పోకిరిలోని డైలాగులు, అతని మ్యానరిజం ఎలా ప్రేక్షకులని ఇప్పటికీ ఫాలో చేయించాయో...ఈ సినిమా స్టైల్ కూడా తప్పకుండా ఇమిటేట్ చేస్తారని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. ఆ స్టైల్ చూడటానికి ఫాలో అవ్వడానికి మరికొద్ది రోజులే వుంది 'దూకుడు" తో దసరా రేస్ లో వున్న మహేస్ 'బిజినెస్ మేన్" తో సంక్రాంతికి వస్తానంటున్నాడు...


Click it and Unblock the Notifications











