నో కామెంట్, రోబోను కాదు: పవన్ మ్యాటర్‌పై రేణు దేశాయ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ గురించి తానేమి మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. అందుకే ఆయన గురించిన ప్రశ్నలకు తాను స్పందించను అంటూ సమాధానం ఇస్తోంది రేణుదేశాయ్. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించిన అడిగిన ప్రశ్నల విషయంలో తాను ఇచ్చిన సమాధానాలను కొందరు మరో రకంగా అర్థం చేసుకున్నారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.
అయితే ఈ మధ్య ఆమె ట్విట్టర్లో పవన్ కళ్యాన్ గురించి పలు సార్లు వ్యాఖ్యానించారు. ఆయన్ను పొగుడూతూ ఆమె వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే ఆమె కావాలని తన ఇమేజ్ పెంచుకోవడానికే పవన్ పేరును వాడుకుంటోందనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ విమర్శలపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించింది.

‘నా కూతురు ఆధ్య కోసం ఓ కవిత రాసా. దానికి కొందరు నేను పవనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొందరు ఊహించుకుంటున్నారు. నేను చేసే ప్రతి ట్వీట్ పవన్ కోసం కాదు. నేను చేసే ప్రతి ట్వీట్లో ఆయన పేరు ప్రస్తావిస్తే ఆయన పేరు వాడుకున్నట్లు అవుతుంది' అని ఓ ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే ఎవరో చేసే విమర్శలకు నేను స్పందించను. నాకంటూ మనసు ఉంది. నేను రోబోను కాదు. నేనే ఆయన్ను కాపీ కొట్టడం లేదు. నాకంటూ ఆలోచనలు ఉన్నాయి. నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నా గురించి కొందరు ఇకనైనా అలా ఆలోచించడం మానుకోవాలి అన్నారు.


Click it and Unblock the Notifications











