ఇవివి బ్యానర్ మూత పడదు: అల్లరి నరేష్

By Bojja Kumar

'ఇవివి సినిమా" బ్యానర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ 2000 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. అప్పటి వరకు దర్శకుడిగా రాణించిన ఆయన 'చాలా బాగుంది" సినిమా ద్వారా నిర్మాతగా మారారు. ఈ బ్యానర్ పై ఇవివి సత్యనారాయణ నిర్మించిన ఆఖరి సినిమా 'ఫిట్టింగ్ మాస్టర్". ఈ సినిమాలో ఇవివి చిన్న కుమారుడు అల్లరి నరేష్ హీరోగా నటించాడు. అయితే ఈఏడాది జనవరిలో ఇవివి ఆకస్మికంగా కన్నుమూసినప్పటి నుంచి ఆ బ్యానర్ పై ఎలాంటి సినిమాలు రాలేదు. ఇవివి లేరు కాబట్టి ఆ బ్యానర్ మూత పడినట్లే అని అంతా భావించారు.

ఈ తరుణంలో బ్యానర్ మూత పడదు, నాన్న ప్రారంభించిన దాన్ని మేము కొనసాగిస్తాం అని సోమవారం ప్రకటించారు ఆయన తనయుడు నరేష్. 2012లో ఓ పెద్ద హీరోతో సినిమా నిర్మించాలని చూస్తున్నాం, ఈ చిత్రానికి నిర్మాతగా మా అన్నయ్య రాజేశ్ వ్యవహరిస్తారు. ఇవివి సినిమా భవిష్యత్తులో ఇంటిల్లిపాదీ తిలకించే చక్కని చిత్రాల్ని నిర్మిస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని నరేష్ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X