ఇవివి సత్యనారాయణ 'బురిడి' కొడ్తున్నాడు
బెండు అప్పారావు చిత్రంతో హిట్ కొట్టిన ఇవివి సత్యనారాయణ తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా 'బురిడి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దుబాయ్ కి చెందిన ఓ తెలుగు ఎన్నారై తన బిగ్ బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కామెడీతో ఉంటుందని తెలుస్తోంది. అది ఆయన 50వ చిత్రం. ఈ చిత్రంతో వరస ఫ్లాఫ్ లలో ఉన్న ఆర్యన్ రాజేష్ కీ హిట్ ఇవ్వాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నాడంటున్నారు. ఈ విషయమై ఇవివి మాట్లాడుతూ..మూడు నెలలుగా ఈ చిత్రం స్క్రిప్టును రూపొందించడం జరిగింది. జనవరి 1 నుంచి నెల రోజులపాటు హైదరాబాదులో చిత్రీకరించి, ఫిబ్రవరిలో బ్యాంకాక్‌లో పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది. మే మొదటివారంలో రిలీజు ఉంటుంది' అన్నారు.
ఇవివి సత్యనారాయణ ఆర్యన్ రాజేష్ అల్లరి నరేష్ బెండు అప్పారావు ఎవరి గోల వారిదే ఆ ఒక్కటి అడక్కు evv satyanarayana aryan rajesh allari naresh bendu apparao


Click it and Unblock the Notifications