అది ఇవివి సీక్వెల్
ఓ ప్రక్క ఆర్య-2,కిక్-2 చిత్రాలు సీక్వెల్స్ అంటూ రంగంలోకి దూకుతూంటే సీనియర్ దర్శకుడు ఇవివి కూడా తనదైన శైలిలో ఓ సీక్వెల్ తో రెడీ అవనున్నాడు. లగడపాటి శ్రీదర్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఎవరి గోల వారిదే చిత్రాన్ని సీక్వెల్ చేయనున్నారు. లారస్కో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాణమవనున్నఈ చిత్రం పూర్తిగా బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఓ కొత్త హీరోయిన్ ని హీరో ఆర్యన్ రాజేష్ కి జోడీగా వెతుకుతున్నారు. అలాగే సునీల్, వేణుమాధవ్ లు మరో రెండు ఇంపార్టెంట్ పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.ఇక సాంకేతిక గణం మొదట సినిమాకు చేసిన వారే ఉంటారు. పూర్తి స్ధాయి కామిడితో మొదటి చిత్రాన్ని మించి నవ్విస్తామని ఇవివి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవివి దర్శకత్వంలో పూర్తయిన బెండు అప్పారావు ఆర్.ఎం.పి చిత్రం కూడా ఈనెల 16న రిలీజ్ అవబోతోంది. అందులో అల్లరినరేష్ ,కామ్నా జఠ్మలాని జంటగా కనిపిస్తారు. గ్రామీణ నేపధ్యంలో ఓ ఆర్.ఎం.పి డాక్టర్ చుట్టూ తిరిగే ఈ చిత్రాన్ని రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.


Click it and Unblock the Notifications











