ఇవివి సత్యనారాయణ పెద్ద కొడుకు కోసం..
బెండు అప్పారావు ఆర్ఎంపి చిత్రంతో చిన్న కొడుకు అల్లరి నరేష్ కు హిట్టిచ్చిన ఇవివి సత్యనారాయణ త్వరలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అది ఆయన 50వ చిత్రం. ఆ చిత్రంలో తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా చేయనున్నారు. ఈ చిత్రంతో వరస ఫ్లాఫ్ లలో ఉన్న అతనికీ హిట్ ఇవ్వాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నాడంటున్నారు.ఈ చిత్రాన్ని బిగ్ బి ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రం వివరాలను బుధవారం ఈవీవి మీడియాకు వివరించాడు.ఆయన మాట్లాడుతూ.. "ఇప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల్లో 'ది బెస్ట్ కామెడీ ఫిలిం'గా దీనిని తెరకెక్కించబోతున్నాను. మూడు నెలలుగా ఈ చిత్రం స్క్రిప్టును రూపొందించడం జరిగింది. జనవరి 1 నుంచి నెల రోజులపాటు హైదరాబాదులో చిత్రీకరించి, ఫిబ్రవరిలో బ్యాంకాక్‌లో పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుంది. మే మొదటివారంలో రిలీజు ఉంటుంది' అన్నారు.
అలాగే ఇప్పటివరకు నేను తీసిన చిత్రాల్లో కామెడీ సినిమా ఏదీ కూడా ఫెయిల్ కాలేదు. అప్పుల అప్పారావు, జంబలకిడి పంబ, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు, హలోబ్రదర్, తొట్టి గ్యాంగ్, కితకితలు, అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావు...ప్రతిదీ కూడా ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఆ మద్దతుతోనే తాజా చిత్రాన్ని మరింత హాస్యభరితంగా ప్లాన్ చేయడం జరిగింది. చిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో ఉంటారు. హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలు వారం రోజుల్లో తెలియపరుస్తాను అన్నారు ఈవీవి.ఇక ఈవీవీ 49వ చిత్రం బెండు అప్పారావు ..ఆర్.ఎంపి. అది మంచి హిట్ గా నమోదు అయిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాను హిట్ చేసి ఆర్యన్ రాజేష్ కు కూడా హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











