ప్రభాస్, నాగార్జున తర్వాత డాన్ నేనే
అమితా బచ్చన్, షారుక్‌ఖాన్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున - వీళ్ల తర్వాత డాన్ నేనే అని ఎమ్మెస్ నారాయణ అంటే ఎలా ఉంటుంది. జయప్రకాష్ రెడ్డి - శకుంతల పార్కులో ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ పల్లీలు తింటే ఎలా ఉంటుంది? తిరుపతి ప్రకాష్ - గీతా సింగ్ 'జయహో' పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? కొత్తగా లేదూ...మా 'బురిడి'లో ఇలాంటి వింతలు చాలా ఉంటాయి అంటున్నారు ప్రముఖ దర్శకులు ఇవివి సత్యనారాయణ. ఆయన తాజాగా రూపొందించిన 'బురిడి' చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. ఈ సందర్బంగా 'బురిడి' గురించి మీడియాతో సినీ విశేషాలు మాట్లాడారు.
అలాగే పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతన్న కొన్ని విషయాలపై ఆయనదైన శైలిలో స్పందించారు. రెండున్నర గంటల సినిమా కోసం వేల అడుగుల ఫిలిం వేస్ట్ చేసే విధానం మారాలి. స్క్రిప్ట్‌ను పగడ్బందీగా ఏర్పాటు చేసుకుంటే...ఈ వేస్టేజ్ ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..'పర్సనల్' విధానం మారాలి. పర్సనల్ మేకప్ మెన్..పర్సనల్ కాస్ట్యూమ్స్...వంటి విధానానికి తెరదించాలి. సక్సెస్ వెంట పరుగెత్తకుండా, టాలెంట్ వైపు పరిగెత్తాలి. అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది' అని ఆయన అన్నారు. ఇక తన కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా ఐశ్వర్య ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ...బిగ్ బి ప్రొడక్షన్స్ ఈ బురిడి చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











