twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కనీసం మూడు సార్లు సినిమాని చూడాలి...ఇవివి

    By Srikanya
    |

    ప్రతి సన్నివేశంలో కనీసం ఎనిమిది సార్లైనా ప్రేక్షకులు నవ్వుకుంటారు. రెండున్నర గంటలు సినిమా చూస్తే వారం రోజుల పాటు ప్రేక్షకులు తలచుకొని తలచుకొని మరీ నవ్వుకోవాలి, ఒక్కొక్కరు కనీసం మూడు సార్లు సినిమాని చూడాలి..అనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాను అంటున్నారు ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ. ఆయన తాజాగా తన కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా 'బురిడి' అనే కామిడీ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా దర్శకుడు ఈవీవీ మీడియాను కలిసి మాట్లాడారు.

    ఇక ఈ చిత్రం టైటిల్ గురించి ఆయన మాటల్లోనే...సాధారణంగా టైటిల్స్‌ అనగానే హీరోని వుద్దేశించి పెడతారు. కానీ 'బురిడి' ఒక హీరో కథ కాదు. ఈ చిత్రంలో కథే హీరో. చిత్రంలోని ప్రతి పాత్రకు ఈ బురిడి అనే టైటిల్‌ వర్తిస్తుంది. ఏదో ఒక సందర్భంలో ప్రతి పాత్ర వేరే పాత్రను 'బురిడి' కొట్టించడం...వేరే వాళ్ళ చేతిలో తను 'బురిడిగా మారటం జరుగుతుంది. టైటిల్‌లోనే సినిమాలో వున్న కథ రుచి చూపించగలిగితే అది ఓపెనింగ్స్‌కు హెల్ప్‌ అవుతుంది. ఈ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు.

    అలాగే 13 జంటలతో ఈ చిత్రంలో ఓ ప్యారడీ సాంగ్‌ను పెట్టారు. ఈ విషయంపై స్పందిస్తూ..సినిమా క్లైమాక్స్ కు ముందు ఆ పాట వస్తుంది. చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుండే ఈ పాట పది నిమిషాల పాటు నాన్‌ స్టాప్‌ గా వుంటుంది. బ్యాంకాక్‌ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చిత్రీకరించని అందమైన లొకేషన్స్‌ లో ఎంతో రిచ్‌గా ఈ పాటను చిత్రీకరించాం. ఎడిటర్‌ గౌతంరాజు ఈ పాటను చూసి ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యాడు అని చెప్పుకొచ్చారు. ఇక 'బురిడి' కథాంశం ఏమిటీ అంటే...బ్యాంకాక్‌ వెళ్లిన 13 విచిత్రమైన జంటల మధ్య కొనసాగే వినోదాల విందే ఈ చిత్ర కథాంశం. ఆ జంటలు కూడా ఎంతో విచిత్రంగా వుంటాయి. సుమన్‌శెట్టి, హేమ ఓ జంట, జయప్రకాష్‌ రెడ్డి, తెలంగాణ శకుంతల మరో జంట, జీవా, సన అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X