నాకు ఆ డైరక్టరే ఇన్‌స్పిరేషన్...ఇవివి సత్యనారాయణ
కామిడీలను తనదైన శైలిలో తీస్తూ నవ్వులు పువ్వులు పూయించే దర్శకుడు ఇవివి సత్యనారాయణ అనే సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ప్రేరణ మాత్రం మరో ప్రముఖ దర్శకుడు వంశీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు అల్లరి నరేష్ హీరోగా చేసిన 'సరదాగా కాసేపు' ఆడియో పంక్షన్ లో చెప్పుకొచ్చారు. ఇవివి మాట్లాడుతూ.."నేను వంశీ అభిమానిని. అందరూ నా సినిమాలకు టైటిల్స్ బాగుంటాయి అని అభినందిస్తారు. కాని టైటిల్స్ పెట్టడంలో నాకు వంశీ ఇన్ స్పిరేషన్. ఆయన తాను తీయబోయే సినిమాలకు ఏ టైటిల్ పెట్టబోతున్నాడా..అని ఆసక్తిగా ఎదురుచూస్తాను. నరేష్ తండ్రిగా కాకుండా వంశీ అభిమానిగా ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. వచ్చే నెల తొమ్మిది లేదా పదవతేదీన చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ తో పాటు అవసరాల శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











