డైరక్టర్ ఇవివికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఈ మధ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. తన కుమారుడు హీరోగా బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం రూపొందిస్తున్న ఆయనకి ఒంట్లో బాగుండక సీరియస్ కావటంతో కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్ మెంట్ ఇప్పించారని చెప్తున్నారు. అనంతంరం ముంబయి లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారని తెలుస్తోంది. ఇప్పుడు క్షేమంగానే ఉన్నా పూర్తి స్ధాయిలో కోలుకోవటానికి ఆరు నెలలుకు పైగా పడుతుందని పూర్తి బెడ్ రెస్ట్ కావాలన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ఇంటిలోంచి కూడా బయిటకు రావద్దని ఇన్ ఫెక్షన్స్ అవీ సోకకుండా చూసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు చెప్తున్నారు. ఇక ఎన్నో కామిడీలు తీసి తెలుగు వారిని నవ్వించిన ఆయన త్వరలోనే కోలుకుని మరిన్ని హాస్య చిత్రాలు అందించాలని కోరుకుందాం.
evv comedy allari naresh director health problem bendu apparao ఇవివిసత్యనారాయణ కామిడీ కేర్ ఆసుపత్రి బెండు అప్పారావు ఆర్ఎంపి


Click it and Unblock the Notifications